Sri Shambhu Deva Prarthana pdf download – శ్రీ శంభుదేవ ప్రార్థన

✅ Fact Checked

బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన శంభుదేవ ప్రార్థన శివుని స్తుతిస్తూ ఉంటుంది.

జయ ఫాలనయన శ్రితలోలనయన సితశైలనయన శర్వా |
జయ కాలకాల జయ మృత్యుమృత్యు జయ దేవదేవ శంభో || 1 ||

జయ చంద్రమౌళి నమదింద్రమౌళి మణిసాంద్రహేళి చరణా |
జయ యోగమార్గ జితరాగదుర్గ మునియాగభాగ భర్గా || 2 ||

జయ స్వర్గవాసి మతివర్గభాసి ప్రతిసర్గసర్గ కల్పా |
జయ బంధుజీవ సుమబంధుజీవ సమసాంధ్య రాగ జూటా || 3 ||

జయ చండచండతర తాండవోగ్రభర కంపమాన భువనా |
జయ హార హీర ఘనసార సారతర శారదాభ్రరూపా || 4 ||

జయ శృంగి శృంగి శ్రుతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతీ |
జయ కాలకంఠ కలకంఠకంఠ సురసుందరీస్తుత శ్రీ || 5 ||

జయ భావజాత సమభావజాత సుకళాజిత ప్రియాహ్రీ |
జయ దగ్ధభావ భవ స్నిగ్ధభావ భవ ముగ్ధభావ భవనా || 6 ||

జయ రుండమాలి జయ రూక్షవీక్ష రుచిరుంద్రరూప రుద్రా |
జయ నాసికాగ్ర నయనోగ్ర దృష్టి జనితాగ్ని భుగ్న విభవా || 7 ||

జయ ఘోర ఘోరతరతాపజాప తప ఉగ్రరూప విజితా |
జయ కాంతిమాలి జయ క్రాంతికేలి జయ శాంతిశాలి శూలీ || 8 ||

జయ సూర్యచంద్రశిఖి సూచనాగ్ర నయలోచనాగ్ర ఉగ్రా |
జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్నుతాంఘ్రి యుగ్మా || 9 ||

జయ ఫాలనేత్ర జయ చంద్రశీర్ష జయ నాగభూష శూలీ |
జయ కాలకాల జయ మృత్యుమృత్యు జయ దేవదేవ శంభో || 10 ||

Also Read  Sri Rudra Stavanam pdf download – శ్రీ రుద్ర స్తవనం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment