Nibba Nibbi meaning in Telugu – నిబ్బా నిబ్బి అర్థాలు తెలుగులో: ఈ మధ్య కాలంలో తరచుగా వినపడే పదాల్లో చాలా మందికి అర్ధం తెలియని పదాలు నిబ్బా – నిబ్బి. ఈ పదాల అర్ధాలు మరియు వీటిని ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలో ఈ పోస్టులో తెలియజేస్తున్నాము.
మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే నిబ్బా, నిబ్బి అనే పదాలు ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, రెడ్దిట్, పింటరెస్ట్, టిక్ టాక్, స్నాప్ చాట్ మొదలైన వాటిలో మీమ్స్, జోక్స్, మరియు ట్రోల్స్ లో వినే వుంటారు. ఇవి సాధారణ వ్యక్తులు కూడా స్నేహితులతో వాట్సాప్ చాట్ లలో వినియోగించే అంత ప్రాచుర్యం సంపాదించుకున్నాయి. వీరిలో చాలామంది ఈ పదాల అర్ధం తెలియక ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది వీటిని ఏ సందర్భంలో వాడాలో తెలియక తికమక పడుతుంటారు. ఈ పదాల అర్ధంతో పాటు వీటి వెనక ఉన్న కథ మరియు వీటిని ఎలాంటి సందర్భాలలో ఎవరితో మాట్లాడేటప్పుడు ఉపయోగించవచ్చో ఈ పోస్టులో మీకు ఉదాహరణలతో తెలియజేస్తున్నాము.

Nibba meaning in Telugu – నిబ్బా మీనింగ్ ఇన్ తెలుగు, నిబ్బ అర్థం తెలుగులో
నిబ్బా అనే పదం తరచుగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ పదం యొక్క అర్ధంతో పాటు దీని వెనక ఉన్న కథ కూడా తెలుసుకోండి.
నిబ్బా (Nibba / निब्बा) = మానసిక పరిపక్వత లేని అబ్బాయి, యుక్త వయసుకి రాని అబ్బాయి, వయసుకి మించిన పనులు చేసే అబ్బాయి
Chapri Nibba meaning in Telugu – చప్రీ నిబ్బా అర్థం తెలుగులో
చప్రీ అంటే చప్రాసీ అని అర్ధం. భారత దేశంలో టిక్ టాక్ ప్రాచుర్యం పొందిన తరువాత చప్రీ నిబ్బా అనే పదం వాడుక లోకి వచ్చింది. టిక్ టాక్ లో కొంతమంది చిరిగిన జీన్స్, పూల చొక్కాలు, విచిత్రమైన హెయిర్ స్టైల్, రంగు రంగుల కళ్ళ జోళ్ళు పెట్టుకుని, జుట్టుకి ఎరుపు లేదా ఆకుపచ్చ లాంటి రంగులు వేసుకుని పశ్చిమ దేశాల్లోని వ్యక్తులలా వ్యవహరించటం చాలా మందికి ఎబ్బెట్టుగా ఉంటుంది. వీళ్ళని కించపరచటానికి ముష్టి వాళ్ళలా ఉన్నారు లేదా చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళలా ఉన్నారు అనే అర్ధాలు వచ్చేలా చప్రీ నిబ్బా (Chapri Nibba) అని పిలుస్తారు. ఈ టిక్ టాకర్స్ లో చాలా మంది ఇలాంటి పనులు చేస్తే అమ్మాయిలు వాళ్ళని ఇష్టపడతారని అనుకుంటారు, పైగా సెలెబ్రిటీలలా ఫీల్ అవుతుంటారు. అందుకే వాళ్ళ వేష భాషలు అసహ్యంగా ఉన్నాయని చెప్పటానికి సంకేతంగా చప్రీ నిబ్బా అనే పదాన్ని వాడతారు.
Nibba word backstory – నిబ్బా పదం వెనుక ఉన్న కథ
ఒకప్పుడు అమెరికా మరియు ఇంకొన్ని పశ్చిమ దేశాల్లో (Western countries) నల్ల జాతీయులను బానిసలుగా చూసేవాళ్ళు. అక్కడి వర్ణ వివక్ష (racism – శరీర రంగును బట్టి కొందరిని తక్కువగా చూడటం) కారణంగా నల్ల జాతీయులు ఎన్నో అవమానాలు ఎదుర్కొనవలసి వచ్చింది. తరువాత కాలంలో అక్కడ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. అందులో భాగంగానే నల్ల జాతీయులపై వివక్ష చూపే పదాలను నిషేదించారు. అందులో ముఖ్యమైనది నీగ్రో అనే పదం. దీనినే కాలక్రమేనా నిగర్ లేదా నిగ్గా అని పిలిచేవారు. ప్రస్తుతం అమెరికా వంటి దేశాల్లో ఎవరినైనా హేళన చేసేందుకు ఈ పదం ఉపయోగిస్తే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఫేస్బుక్ ప్రాచుర్యం పొందుతున్న తొలినాళ్లలో చాలా మంది ఈ పదాన్ని ఉపయోగించేవారు. దీనిపై చర్యలు తీసుకుని ఆ పదాన్ని వాళ్ళు బ్యాన్ చేశారు. ఇప్పుడు ఎవరైనా అసందర్భంగా ఈ పదాన్ని ఉపయోగిస్తే వాళ్ళ అకౌంట్ కూడా బ్యాన్ అవుతుంది. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు నిబ్బా (Nibba) అని వాడటం మొదలుపెట్టారు.
ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే వాళ్ళు స్త్రీ పురుషులిరువురికీ కేవలం నిబ్బా అనే ఉపయోగించేవారు. ముఖ్యంగా మీమ్స్ పేజెస్ లో ఈ పదం ప్రాచుర్యం పొంది మిగిలిన దేశాలకు పాకింది. మన దేశంలో తొలిదశలో మీమ్స్ చేసేవాళ్ళు ఈ తెలియకుండానే ఎవరినైనా హేళన చేయటానికి వాడటం మొదలుపెట్టారు. కొంతకాలానికి అది పెడదోవ పడుతున్న యువత, మానసిక పరిణతి లేని ప్రేమికుల కోసం ఉపయోగించసాగారు. కొన్ని దశల మార్పుల తరువాత ప్రస్తుతం వాడుతున్న అర్ధం స్థిరపడింది. ముందు ముందు ఇది మరి కొన్ని మార్పులకు గురైనా ఆశ్చర్యపడనవసరం లేదు.
Nibbi meaning in Telugu – నిబ్బి మీనింగ్ ఇన్ తెలుగు, నిబ్బి అర్థం తెలుగులో
పశ్చిమ దేశాల్లో నిబ్బా అనే పదం లింగభేదం లేకుండా అందరికీ వర్తిస్తుంది. కానీ, మన దగ్గర నిబ్బా అనేది కేవలం పురుషులను ఉద్దేశించి పిలిచే పదంగా మారిపోయింది. అందుకే మీమర్స్ స్త్రీల కోసం నిబ్బి (Nibbi/Nibby) అనే కొత్త పదాన్ని సృష్టించారు. రెండు పదాలకు పెద్దగా వ్యత్యాసం లేదు.
నిబ్బి (Nibbi / Nibby / निब्बी) = మానసిక పరిపక్వత లేని అమ్మాయి, టీనేజ్ అమ్మాయి, యుక్త వయసు రాకుండానే ప్రేమలో పడిన అమ్మాయి, శారీరకంగా మరియు మానసికంగా పూర్తిగా ఎదగని అమ్మాయి
నిబ్బా నిబ్బి అనే పదాలను మీరు ఎక్కువగా మీమ్స్ మరియు జోక్స్ లో చూస్తారు. ముఖ్యంగా మీమ్స్ కోసం పిల్లి వంటి జంతువుల బొమ్మలు వాడినప్పుడు వాటిలో లింగభేదం చూపించటం కోసం మగ పిల్లికి తిలకం పెట్టడం, కళ్ళజోడు లేదా సిగరెట్ వంటివి జోడించడం చేస్తారు. ఆడ పిల్లికి చీర కట్టడం, బొట్టు పెట్టడం వంటివి చేస్తారు. ఇలాంటి అతిశయోక్తి హాస్య రసం పండించడంలో ఉపయోగపడుతుంది.
How to use Nibba Nibbi in a sentence? – నిబ్బా నిబ్బి పదాలను ఏ సందర్భంలో వాడతారు?
ఈ నిబ్బా నిబ్బి పదాలను ప్రేమలో ఉన్న యువజంటలను ఉద్దేశించి ఎక్కువగా ఉపయోగిస్తారు. పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ చదువుతూ ప్రేమలో పడే టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలను ఉద్దేశించి వాడతారు. సాధారణంగా వాళ్లకు శారీరక మరియు మానసిక ఎదుగుదల లేకపోవటం వల్లే ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటారు అని వెటకారంగా చెప్పటానికి ఈ పదాలను వాడతారు. నిబ్బా నిబ్బి అనే పదాలు కొన్నిసార్లు యువత చేసే పనులను బలహీనతలుగా చూపించటానికి కూడా వాడతారు.
Nibba Nibbi memes and jokes in Telugu – నిబ్బా నిబ్బి మీమ్స్, జోక్స్
మీరు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటే నిబ్బా నిబ్బి మీమ్స్ మరియు జోక్స్ చాలానే చూసుంటారు. ఇవి యువతను హేళన చేయటానికి ఉపయోగించినప్పటికీ వీటిని క్రియేట్ చేసేవాళ్ళలో ఎక్కువమంది యువతీ యువకులే ఉండటం గమనార్హం. కేవలం తెలుగులోనే కాకుండా ఇండియాలో దాదాపు అన్ని భాషల్లో ఈ మీమ్స్ ప్రాచుర్యం సంతరించుకున్నాయి. వీటిని ముఖ్యంగా ప్రేమ వ్యామోహంలో తల్లిదండ్రుల మాటలు పెడచెవిన పెడుతూ, కెరీర్ పై దృష్టి సారించకుండా, చదువుని నిర్లక్ష్యం చేస్తూ, తెలివితక్కువగా వ్యవహరించే యువతీ యువకులను ట్రోల్ చేయటానికి ఉపయోగిస్తారు. సామజిక మాధ్యమాల్లో వీటి పాపులారిటీ అంతకంతకూ పెరుగుతూనే పోతుంది.
Nibba Nibbi examples – నిబ్బా నిబ్బి ఉదాహరణలు
నిబ్బా (Nibba) నిబ్బి (Nibbi) అనే పదాలను సాధారణ సంభాషణల్లో ఎలా ఉపయోగిస్తారో క్రింది ఉదాహరణలలో చూడవచ్చు.
- ఈ సినిమా అర్జున్ రెడ్డిలా తీద్దామనుకున్నారు, కానీ హీరో నిబ్బా గాడిలా ఉన్నాడు.
- మా ఇంటి దగ్గర ఒక ఇంటర్ నిబ్బికి ఇంస్టాగ్రామ్ లో లక్షకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు.
- శ్రీకాంత్ గాడి తమ్ముడు ఎప్పుడూ బ్రేకప్, లవ్ ఫెయిల్యూర్ లాంటి వాట్సాప్ స్టేటస్ పెడుతుంటాడు. చూస్తుంటే పెద్ద నిబ్బా గాడిలా తయారయ్యేలా ఉన్నాడు.
- నేను ఈరోజు ఆటోలో వస్తుంటే ఎవరో నిబ్బి తెగ చాటింగ్ చేస్తుంది.
- ఈ సినిమా రిలీజ్ కి ముందు ఏదో క్లాసిక్ లవ్ స్టోరీ అన్నారు, తీరా చూస్తే నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ లా ఉంది.
ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.
nibba ante naa friend okadu gurthosthadu 😂
Great info and good examples
Google lo Nibba meaning in Telugu = nibba ani chupisthundi 😁
Ippudu Instagram lo ekkada chusina #nibba #nibba ani use chestunnaru
Nibba meaning in Instagram ani vethikithe nibba nibbi & co andaru dorukutaru…
thought nibbi meant innocent girl.. lol
Chala baga explain cheseru
Nibbi ante cute unde girl anukunna
Arjun Reddy la feel ayye nibba 🤣
Instagram is full of Nibba nibbi memes
Nibba ante English lo nigga ani pilavataniki use chestaru. Adi akkada slums & downtown language. Mana daggara posh ga use chestunnaru.
Nibbi ante aada pilli anukunna
Interesting backstory
very good use of contemporary telugu
I never heard chapri nibba before
Edo random words anukunna, intha story unda. Thanks for sharing 👍
Good info
Interesting nibba meaning in telugu
Inka kotha words kooda vastunnayi… Nibba ante common aipoindi.
Nice
Nibba word movies lo peddaga use cheyatledu
Interesting display of emotions
Confusion clear chesaru
Naa friends thega vadutunnaru
Maa friends antha nibba gaallala behave chestaru… Nenevadiki cheppukovali 😃
Shadnagar lo evaraina invest chestunnara?
Pilla nibba ante enti?
Instagram lo unnantha drama ekkada chudaledu 👍
Tiktok ban chesi manchi pani chesaru
Nibba and Nibbi ippudu movies lo kooda use chestunnaru