Possessive meaning in Telugu – పొసెసివ్ అర్ధం తెలుగులో

✅ Fact Checked

Possessive meaning in Telugu – పొసెసివ్ అర్ధం తెలుగులో: పొసెసివ్ అనే పదం ప్రేమికులు మరియు ఇష్టమైన వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు తరచుగా వినిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా మరియు సినిమాల్లో కూడా ఈ పదాన్ని తరచుగా ఉపయోగిస్తున్నారు. ఈ పదం యొక్క అర్ధం మరియు దీనిని ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలో ఈ పోస్టులో తెలియజేస్తున్నాము.

Possessive meaning in Telugu – పొసెసివ్ అర్ధం తెలుగులో

పొసెసివ్ అంటే ఒక వ్యక్తి లేదా వస్తువు తనకు మాత్రమే సొంతం అని భావించటం. ఇది సాధారణంగా ప్రేమికుల విషయంలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక యువకుడు తాను ప్రేమించిన అమ్మాయితో వేరే అబ్బాయిలు సన్నిహితంగా ఉంటే చూసి తట్టుకోలేకపోవటాన్ని పొసెసివ్ అనవచ్చు. అలాగే ఒక అమ్మాయి తన స్కూటీ వేరే వాళ్లకు ఇవ్వటానికి ఇష్టపడకపోవటాన్ని కూడా పొసెసివ్ అని చెప్పవచ్చు. పొసెసివ్ గా ఉండే వ్యక్తులు కోల్పోతామేమో అనే భయంతో లేదా జాగ్రత్త కొద్దీ అలా ప్రవర్తించవచ్చు.

పొసెసివ్ (possessive) = స్వాధీనత, స్వాధీనమైనది, తనకు మాత్రమే సొంతం అని భావించటం.

పొసెసివ్ గా ఉండే వ్యక్తులలో అబ్సెసివ్ బిహేవియర్ కూడా ఉండే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో వీరు అనుమానం కూడా ప్రదర్శిస్తారు. ఈ లక్షణాలలో సందర్భానుసారం మార్పులు కూడా ఉండవచ్చు.

Possessive synonyms and pronunciation in Telugu

పొసెసివ్ అనే పదాన్ని నాకు మాత్రమే సొంతం లేదా ఆ వ్యక్తికి మాత్రమే సొంతం అని చెప్పే సందర్భాలలో ఉపయోగిస్తారు. ఈ పదాన్ని సాధారణంగా నెగెటివ్ గా చెప్పటానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు మగధీర సినిమాలో విలన్ “నాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు” అంటాడు. దీన్ని పొసెసివ్ బిహేవియర్ గా పరిగణించవచ్చు. కానీ సాధారణంగా ఈ పదాన్ని ఉపయోగించేటప్పుడు సందర్భం మరీ అంత క్రూరత్వంగా ఉండాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు మీ మీద అపరిమితమైన ప్రేమను చూపించేటప్పుడు కూడా పొసెసివ్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు.

Possessive synonyms in Telugu = అతి ప్రేమ, అదుపు చేయాలనుకోవడం, నియంత్రించటం, స్వతంత్రత లేకుండా చేయటం

Possessive అనే పదాన్ని తెలుగులో పొసెసివ్ అని పలుకుతారు. ఇది చాలా సులువుగా పలకవచ్చు. ఈ పదాన్ని ఉపయోగించే సందర్భాలు కూడా నిర్దిష్టంగా ఉంటాయి.

Possessive pronunciation in Telugu = పొసెసివ్

Possessive usage in a sentence in Telugu

పొసెసివ్ అనే పదానికి మరికొన్ని పదప్రయోగాలు క్రింద ఇచ్చిన వాక్యాలలో గమనించవచ్చు.

పొసెసివ్ గర్ల్ (Possessive girl)ఒక వ్యక్తి లేదా వస్తువు తనకు మాత్రమే సొంతం అనుకునే అమ్మాయి
షి ఈజ్ వెరీ పొసెసివ్ (She is very possessive)ఆ అమ్మాయి చాలా పొసెసివ్ గా ఉంది. తనకు ఇష్టమైన వ్యక్తులు మరియు వస్తువులు ఇంకెవరికీ దక్కకూడదు అనుకుంటుంది
ఓవర్ పొసెసివ్ (Over possessive)అతిగా నియంత్రించటం, అదుపు చేయాలనుకోవడం, ఇంకెవరికీ దక్కకుండా ఉండటానికి శత విధాలా ప్రయత్నించటం
పొసెసివ్ బాయ్ (Possessive boy)ఒక వ్యక్తి లేదా వస్తువు తనకు మాత్రమే సొంతం అనుకునే అబ్బాయి
పొసెసివ్ క్వీన్ (Possessive queen)అన్నీ తనకే సొంతం అనుకునే రాణి (పొసెసివ్ గర్ల్ కు పర్యాయ పదంలా కూడా ఉపయోగిస్తారు)
పొసెసివ్ ఫ్రెండ్ (Possessive friend)తన స్నేహితుడు/స్నేహితురాలు తనకు మాత్రమే సొంతం అనుకునే వ్యక్తి
పొసెసివ్నెస్ (Possessiveness)ఒకరి ధ్యాస లేదా ప్రేమ తనకు మాత్రమే సొంతం అనుకోవటం
పొసెసివ్ వైఫ్ (Possessive wife)తన భర్త తనకు మాత్రమే సొంతం అనుకునే భార్య
పొసెసివ్ హస్బెండ్ (Possessive husband)తన భార్య తనకు మాత్రమే సొంతం అనుకునే భర్త
పొసెసివ్ బాయ్ ఫ్రెండ్ (Possessive boyfriend)తన ప్రియురాలు తనకు మాత్రమే సొంతం అనుకునే ప్రియుడు
పొసెసివ్ గర్ల్ ఫ్రెండ్ (Possessive girlfriend)తన ప్రియుడు తనకు మాత్రమే సొంతం అనుకునే ప్రియురాలు

Possessive examples in Telugu

పొసెసివ్ అనే పదానికి ఉదాహరణలు క్రింద ఇచ్చిన వాక్యాలలో గమనించవచ్చు.

  • ఆమె తన భర్త విషయంలో చాలా పొసెసివ్ గా ఉంటుంది. అతను వేరే వాళ్ళతో నవ్వుతూ మాట్లాడినా సహించదు.
  • శ్రావణి చాలా పొసెసివ్ గా ఉంటుంది. తన వస్తువులు వేరే వాళ్ళు ముట్టుకోవటం తనకు ఇష్టం ఉండదు.
  • వరుణ్ తన గర్ల్ ఫ్రెండ్ కి చాలా రెస్ట్రిక్షన్స్ పెడతాడు. మరీ అంత పొసెసివ్ గా ఉంటె భరించటం ఎవరి వల్లా కాదు.
  • ఎందుకు నీ ఫోన్ అంటే అంత పొసెసివ్ గా ఉంటావు. అదేమైనా ఐ ఫోన్ అనుకుంటున్నావా అలా దాచిపెట్టుకుంటున్నావు.

ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment