How about you meaning in Telugu – హౌ అబౌట్ యు అంటే ఏమిటి?

✅ Fact Checked

How about you meaning in Telugu – హౌ అబౌట్ యు అంటే ఏమిటి: కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్లకు “హౌ అబౌట్ యు” (how about you) లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పటం కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. కొంతమంది అయితే ఎవరైనా “హౌ ఆర్ యు” (how are you) అని అడిగితే వాళ్ళ జీవిత చరిత్ర అంతా చెప్తారు. మీరు ఎలాంటి సంకోచం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే ఇలాంటి చిన్న చిన్న పద ప్రయోగాలు ఖచ్చితంగా తెలియాలి.

How about you meaning in Telugu

How about you meaning in Telugu – హౌ అబౌట్ యు అంటే తెలుగులో అర్ధం ఏమిటి?

హౌ అబౌట్ యు అంటే సాధారణంగా మీరు ఎలా ఉన్నారు అనే అర్ధం వస్తుంది. కానీ సందర్భాన్ని బట్టి వేరే అర్ధాలు ఉండవచ్చు. ఎవరైనా ఏదైనా ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానం చెపుతూ చివరిగా వాళ్ళని కూడా అదే ప్రశ్న అడగడానికి “హౌ అబౌట్ యు” ఉపయోగిస్తారు.

హౌ అబౌట్ యు అంటే ఏమిటి?

హౌ అబౌట్ యు (How about you) = మీరు ఎలా ఉన్నారు?

సహజంగా చాలా మంది “హౌ అబౌట్ యు” (how about you) మరియు “వాట్ అబౌట్ యు” (what about you) ఒకదాని బదులు మరొకటి ఉపయోగిస్తారు. ఉదాహరణకు మీరు ఎవరినైనా మీరెలా ఉన్నారు అని అడిగితే “నేను బాగున్నాను, హౌ అబౌట్ యు” అంటారు. ఇద్దరు స్నేహితులు రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి “నేను బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాను, హౌ అబౌట్ యు?” అని అడుగుతాడు. మీరు హౌ అబౌట్ యు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే అంతకు ముందు ఎం చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు అనేవి గుర్తించాలి. సందర్భానుసారం ఈ ప్రశ్నకు సమాధానం కూడా మారిపోతుంది.

Difference between How about you vs What about you – హౌ అబౌట్ యు మరియు వాట్ అబౌట్ యు మధ్య వ్యత్యాసం

హౌ అబౌట్ యు మరియు వాట్ అబౌట్ యు రెండిటిని ఒకేలా ఉపయోగించటం వల్ల వాటి వ్యత్యాసం తెలుసుకోవటం కష్టంగా అనిపించవచ్చు. అందుకే ఇక్కడ మీకు వాటి వ్యత్యాసం ఉదాహరణలతో తెలియజేస్తున్నాము. మీరు గుర్తుపెట్టుకోవటానికి సులువుగా ఉండాలంటే హౌ అబౌట్ యు అనేది వ్యక్తిగత విషయాల కోసం ఉపయోగించవచ్చు. మీ ఫీలింగ్స్, ఎమోషన్స్, లేదా ఏదైనా వ్యక్తిగత వివరాల గురించి చెప్పేటప్పుడు హౌ అబౌట్ యు అని అడగవచ్చు. వాట్ అబౌట్ యు అనేది వస్తువులు, ప్రాంతాల విషయంలో ఉపయోగిస్తారు. సాధారణంగా ఈ రెండు ప్రశ్నలను ఒకదాని బదులు మరొకటి లేదా కేవలం “యు?” (you?) అని ఉపయోగించవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం అలా ఉపయోగించటం సాధ్యపడదు.

ఒక వ్యక్తి తన స్నేహితుడితో “We are going to watch a movie, how about you?” అని అడిగితే “మేము సినిమా చూడటానికి వెళ్తున్నాం, కావాలంటే నువ్వు కూడా రావచ్చు” అని అర్ధం. అదే “We are going to watch a movie, what about you?” అని అడిగితే “మేము సినిమా చూడటానికి వెళ్తున్నాం, మరి నువ్వేం చేస్తున్నావు” అని అర్ధం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వాట్ అబౌట్ యు అని అడిగినప్పుడు నువ్వు రావద్దు అని చెప్పట్లేదు. కొన్ని సందర్భాలలో ఏం చేస్తున్నారో తెలుసుకుని ఆ తరువాత నువ్వు కూడా మాతో రావచ్చు కదా అని అడిగే అవకాశం ఉంది.

ఒక అమ్మాయి తన స్నేహితురాలితో “రోజంతా ఇంట్లో కూర్చుని బోర్ కొడుతుంది, హౌ అబౌట్ యు?” అని అడుగుతుంది. ఇక్కడ ఆ అమ్మాయికి బోర్ కొడుతుంది అనేది ఇంపార్టెంట్. తరువాత ఇద్దరు కలిసి సినిమా లేదా షాపింగ్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. అదే తను “నాకు బోర్ కొడుతోంది, ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాను, వాట్ అబౌట్ యు?” అని అడిగితే ఆ అమ్మాయి గేమ్స్ ఆడుకుంటుంది అనేది ఇంపార్టెంట్. ఇందులో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఆ అమ్మాయి నువ్వేమి చేస్తున్నావు అని మాత్రమే తెలుసుకోవాలనుకుంటుంది.

ఈ విధంగా మీరు ఎలాంటి సంకోచం లేకుండా “హౌ అబౌట్ యు” అని మీ ఫ్రెండ్స్ తో మాట్లాడవచ్చు లేదా సమాధానం చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని పోస్టుల కోసం తెలుగు రష్ వెబ్సైటును ఫాలో అవ్వండి.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment