Obsessed meaning in Telugu – అబ్సెస్డ్ అర్ధం తెలుగులో: అబ్సెస్డ్ అనే పదం సినిమాలు లేదా సామాజిక మాధ్యమాల్లో తరచుగా వినిపిస్తుంది. ఈ పదం యొక్క అర్ధం మరియు దీనిని ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలో ఈ పోస్టులో తెలియజేస్తున్నాము.
మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే అబ్సెస్డ్ అనే పదం ఇప్పటికే విని ఉంటారు. ఇది ఒక విషయం లేదా వ్యక్తి గురించి ఎక్కువ ఆసక్తి కనపరిచిన సందర్భాలలో చూస్తుంటాం. మీలో చాలామంది ఈ పదం యొక్క అర్ధం తెలియక ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది దీనిని ఏ సందర్భంలో వాడాలో తెలియక తికమక పడుతుంటారు. ఈ పదం అర్ధంతో పాటు దీనిని ఎలాంటి సందర్భాలలో ఎవరితో మాట్లాడేటప్పుడు ఉపయోగించవచ్చో ఈ పోస్టులో మీకు ఉదాహరణలతో తెలియజేస్తున్నాము.
Obsessive meaning in Telugu – అబ్సెసివ్ అర్ధం తెలుగులో
అబ్సెసివ్ అంటే ఒక వ్యక్తి లేదా వస్తువు గురించి అమితాసక్తి కలిగియుండుట, దాని గురించే ఎప్పుడూ ఆలోచించుట, మరియు దానిని కోల్పోతామేమో అని దిగులు చెందుట వంటి లక్షణాలు. ఉదాహరణకు చిన్న పిల్లలు వీడియో గేమ్ ఆడకుండా ఉండలేరు. దానిని అబ్సెసివ్ బిహేవియర్ అనవచ్చు. ఒకవేళ వాటిని ఆడనివ్వకపోతే వారిలో మానసిక సమస్యలు తలెత్తితే అప్పుడు అడిక్షన్ గా పరిగణించాలి. ఒక సినీ నటుడు, క్రీడాకారుడు, లేదా రాజకీయ నాయకుడి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటే దానిని కూడా అబ్సెషన్ అనవచ్చు. ఇలా ఉండే మానసిక స్థితిని గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి గురించి అబ్సెసివ్ గా ఉన్నారని చెప్తాము.
అబ్సెసివ్ (Obsessive) = అమితాసక్తి కలిగియుండుట, అతిగా ఆలోచించుట, లేదా కోల్పోతామేమో అని దిగులు చెందుట
Obsessed meaning in Telugu – అబ్సెస్డ్ అర్ధం తెలుగులో
అబ్సెస్డ్ అంటే ఒక వ్యక్తి లేదా వస్తువు విషయంలో అబ్సెసివ్ గా ఉండుట. దీనిని సాధారణంగా అభిమానం, పిచ్చి, వ్యామోహం లాంటి పదాలతో చెప్తాము. కానీ ఆ పదాలను వేరే సందర్భాలలో ఉపయోగిస్తే అర్ధం పూర్తిగా మారిపోతుంది. ఉదాహరణకు మా అబ్బాయికి ఆ హీరో అంటే పిచ్చి అనటానికి, మా అబ్బాయికి పిచ్చి అనటానికి చాలా తేడా ఉంటుంది. అబ్సెస్డ్ అనే పదాన్ని ఒక వ్యక్తి లేదా వస్తువు విషయంలో అమితాసక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తాము. ఒక స్థాయి తర్వాత అది మానసిక సమస్యలకు కూడా దారితీయవచ్చు. అందుకే అబ్సెషన్ కూడా ఒక స్థాయికి మించి ఉండకూడదు.
అబ్సెస్డ్ (Obsessed) = ఒక వ్యక్తి లేదా వస్తువు గురించి అమితాసక్తి కలిగియుండుట, అతిగా ఆలోచించుట, లేదా అతిగా కలత చెందుట
Self-obsessed meaning in Telugu – సెల్ఫ్ అబ్సెస్డ్ అర్ధం తెలుగులో
సెల్ఫ్ అబ్సెస్డ్ అంటే ఎప్పుడు తన గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ఉండే మానసిక స్థితి. ఇది కొంత మందికి స్వార్థంలా అనిపించవచ్చు. కానీ స్వార్ధం అంటే ప్రతి పనిలో స్వలాభం చూసుకోవటం. కానీ సెల్ఫ్ అబ్సెస్డ్ అంటే ఏ పని చేయకపోయినా కూడా తన గురించే ఆలోచించుకుంటూ ఉంటారు. వీరికి లాభాపేక్ష ఉండదు. కొందరు ఎప్పుడు అద్దంలో అందం చూసుకుని మురిసిపోతుంటారు. వారిని కూడా సెల్ఫ్ అబ్సెస్డ్ అనవచ్చు.
సెల్ఫ్ అబ్సెస్డ్ (Self-obsessed) = ఎప్పుడూ తన గురించే ఆలోచించుకోవటం, తన విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శించటం, లేదా కలత చెందటం
ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.