Sri Vaidyanatha Ashtakam pdf download – శ్రీ వైద్యనాథాష్టకం

✅ Fact Checked

శ్రీరామసౌమిత్రిజటాయువేద
షడాననాదిత్య కుజార్చితాయ |
శ్రీనీలకంఠాయ దయామయాయ
శ్రీవైద్యనాథాయ నమః శివాయ || 1 ||
గంగాప్రవాహేందు జటాధరాయ
త్రిలోచనాయ స్మర కాలహంత్రే |
సమస్త దేవైరభిపూజితాయ
శ్రీవైద్యనాథాయ నమః శివాయ || 2 ||
భక్తప్రియాయ త్రిపురాంతకాయ
పినాకినే దుష్టహరాయ నిత్యం |
ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే
శ్రీవైద్యనాథాయ నమః శివాయ || 3 ||
ప్రభూతవాతాది సమస్తరోగ-
-ప్రణాశకర్త్రే మునివందితాయ |
ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ
శ్రీవైద్యనాథాయ నమః శివాయ || 4 ||
వాక్శ్రోత్రనేత్రాంఘ్రి విహీనజంతోః
వాక్శ్రోత్రనేత్రాంఘ్రి సుఖప్రదాయ |
కుష్ఠాదిసర్వోన్నతరోగహంత్రే
శ్రీవైద్యనాథాయ నమః శివాయ || 5 ||
వేదాంతవేద్యాయ జగన్మయాయ
యోగీశ్వరధ్యేయపదాంబుజాయ |
త్రిమూర్తిరూపాయ సహస్రనాంనే
శ్రీవైద్యనాథాయ నమః శివాయ || 6 ||
స్వతీర్థమృద్భస్మభృతాంగభాజాం
పిశాచదుఃఖార్తిభయాపహాయ |
ఆత్మస్వరూపాయ శరీరభాజాం
శ్రీవైద్యనాథాయ నమః శివాయ || 7 ||
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ
స్రక్గంధభస్మాద్యభిశోభితాయ |
సుపుత్రదారాది సుభాగ్యదాయ
శ్రీవైద్యనాథాయ నమః శివాయ || 8 ||
బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చ |
జపేన్నామత్రయం నిత్యం మహారోగనివారణం || 9 ||


Also Read  Shivananda Lahari pdf download – శివానందలహరీ
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment