Sri Sainatha Pancharatna Stotram pdf download – శ్రీ సాయినాథ పంచరత్న స్తోత్రం

ప్రత్యక్షదైవం ప్రతిబంధనాశనం
సత్యస్వరూపం సకలార్తినాశనం |
సౌఖ్యప్రదం శాంతమనోజ్ఞరూపం
సాయినాథం సద్గురుం చరణం నమామి || 1 ||
భక్తావనం భక్తిమతాం సుభాజనం
ముక్తిప్రదం భక్తమనోహరం |
విభుం జ్ఞానసుశీలరూపిణం
సాయినాథం సద్గురుం చరణం నమామి || 2 ||
కారుణ్యమూర్తిం కరుణాయతాక్షం
కరారిమభ్యర్థిత దాసవర్గం |
కామాది షడ్వర్గజితం వరేణ్యం
సాయినాథం సద్గురుం చరణం నమామి || 3 ||
వేదాంతవేద్యం విమలాంతరంగం
ధ్యానాధిరూఢం వరసేవ్యసద్గురుం |
త్యాగి మహల్సాపతి సేవితాగ్రం
సాయినాథం సద్గురుం చరణం నమామి || 4 ||
పత్రిగ్రామే జాతం వర షిరిడి గ్రామనివాసం
శ్రీవేంకటేశ మహర్షి శిష్యం |
శంకరం శుభకరం భక్తిమతాం
సాయినాథం సద్గురుం చరణం నమామి || 5 ||
ఇతి శ్రీ సాయినాథ పంచరత్న స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment