Sri Chidambareswara Stotram pdf download – శ్రీ చిదంబరేశ్వర స్తోత్రం

కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీవామభాగం |
సదాశివం రుద్రమనంతరూపం
చిదంబరేశం హృది భావయామి || 1 ||
వాచామతీతం ఫణిభూషణాంగం
గణేశతాతం ధనదస్య మిత్రం |
కందర్పనాశం కమలోత్పలాక్షం
చిదంబరేశం హృది భావయామి || 2 ||
రమేశవంద్యం రజతాద్రినాథం
శ్రీవామదేవం భవదుఃఖనాశం |
రక్షాకరం రాక్షసపీడితానాం
చిదంబరేశం హృది భావయామి || 3 ||
దేవాదిదేవం జగదేకనాథం
దేవేశవంద్యం శశిఖండచూడం |
గౌరీసమేతం కృతవిఘ్నదక్షం
చిదంబరేశం హృది భావయామి || 4 ||
వేదాంతవేద్యం సురవైరివిఘ్నం
శుభప్రదం భక్తిమదంతరాణాం |
కాలాంతకం శ్రీకరుణాకటాక్షం
చిదంబరేశం హృది భావయామి || 5 ||
హేమాద్రిచాపం త్రిగుణాత్మభావం
గుహాత్మజం వ్యాఘ్రపురీశమాద్యం |
శ్మశానవాసం వృషవాహనస్థం
చిదంబరేశం హృది భావయామి || 6 ||
ఆద్యంతశూన్యం త్రిపురారిమీశం
నందీశముఖ్యస్తుతవైభవాఢ్యం |
సమస్తదేవైః పరిపూజితాంఘ్రిం
చిదంబరేశం హృది భావయామి || 7 ||
తమేవ భాంతం హ్యనుభాతిసర్వ-
-మనేకరూపం పరమార్థమేకం |
పినాకపాణిం భవనాశహేతుం
చిదంబరేశం హృది భావయామి || 8 ||
విశ్వేశ్వరం నిత్యమనంతమాద్యం
త్రిలోచనం చంద్రకలావతంసం |
పతిం పశూనాం హృది సన్నివిష్టం
చిదంబరేశం హృది భావయామి || 9 ||
విశ్వాధికం విష్ణుముఖైరుపాస్యం
త్రిలోచనం పంచముఖం ప్రసన్నం |
ఉమాపతిం పాపహరం ప్రశాంతం
చిదంబరేశం హృది భావయామి || 10 ||
కర్పూరగాత్రం కమనీయనేత్రం
కంసారిమిత్రం కమలేందువక్త్రం |
కందర్పగాత్రం కమలేశమిత్రం
చిదంబరేశం హృది భావయామి || 11 ||
విశాలనేత్రం పరిపూర్ణగాత్రం
గౌరీకలత్రం హరిదంబరేశం |
కుబేరమిత్రం జగతః పవిత్రం
చిదంబరేశం హృది భావయామి || 12 ||
కళ్యాణమూర్తిం కనకాద్రిచాపం
కాంతాసమాక్రాంతనిజార్ధదేహం |
కపర్దినం కామరిపుం పురారిం
చిదంబరేశం హృది భావయామి || 13 ||
కల్పాంతకాలాహితచండనృత్తం
సమస్తవేదాంతవచోనిగూఢం |
అయుగ్మనేత్రం గిరిజాసహాయం
చిదంబరేశం హృది భావయామి || 14 ||
దిగంబరం శంఖసితాల్పహాసం
కపాలినం శూలినమప్రయేం |
నాగాత్మజావక్త్రపయోజసూర్యం
చిదంబరేశం హృది భావయామి || 15 ||
సదాశివం సత్పురుషైరనేకైః
సదార్చితం సామశిరః సుగీతం |
వైయ్యాఘ్రచర్మాంబరముగ్రమీశం
చిదంబరేశం హృది భావయామి || 16 ||
చిదంబరస్య స్తవనం పఠేద్యః
ప్రదోషకాలేషు పుమాన్ స ధన్యః |
భోగానశేషాననుభూయ భూయః
సాయుజ్యమప్యేతి చిదంబరస్య || 17 ||
ఇతి శ్రీచిదంబరేశ్వర స్తోత్రం సంపూర్ణం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment