Saravanabhava Mantrakshara Shatkam pdf download – శరవణభవ మంత్రాక్షర షట్కం

✅ Fact Checked

శక్తిస్వరూపాయ శరోద్భవాయ
శక్రార్చితాయాథ శచీస్తుతాయ |
శమాయ శంభుప్రణవార్థదాయ
శకారరూపాయ నమో గుహాయ || 1 ||
రణన్మణిప్రోజ్జ్వలమేఖలాయ
రమాసనాథప్రణవార్థదాయ |
రతీశపూజ్యాయ రవిప్రభాయ
రకారరూపాయ నమో గుహాయ || 2 ||
వరాయ వర్ణాశ్రమరక్షకాయ
వరత్రిశూలాభయమండితాయ |
వలారికన్యాసుకృతాలయాయ
వకారరూపాయ నమో గుహాయ || 3 ||
నగేంద్రకన్యేశ్వరతత్త్వదాయ
నగాధిరూఢాయ నగార్చితాయ |
నగాసురఘ్నాయ నగాలయాయ
నకారరూపాయ నమో గుహాయ || 4 ||
భవాయ భర్గాయ భవాత్మజాయ
భస్మాయమానాద్భుతవిగ్రహాయ |
భక్తేష్టకామప్రదకల్పకాయ
భకారరూపాయ నమో గుహాయ || 5 ||
వల్లీవలారాతిసుతార్చితాయ
వరాంగరాగాంచితవిగ్రహాయ |
వల్లీకరాంభోరుహమర్దితాయ
వకారరూపాయ నమో గుహాయ || 6 ||


Also Read  Sri Subrahmanya stotram pdf download – శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment