మహేష్ వర్సెస్ బన్నీ – ఎవరి స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది?

✅ Fact Checked

చాలా కాలం తర్వాత సంక్రాంతి సీజన్లో గట్టి పోటీ నెలకొంది. సాధారణంగా పోటీ ఉన్నప్పుడు వేరే జోనర్ లేదా ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు పోటీపడుతుంటారు. కానీ ఈసారి ఇద్దరు యంగ్ హీరోలు యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేయటంతో పోటీ రసవత్తరంగా మారింది. మొదట రెండు చిత్రాలని 12న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇలా చేస్తే రెండు సినిమాలు నష్టపోతాయనే ఉద్దేశ్యంతో ఒక రోజు వ్యవధిలో రిలీజ్ చేయటానికి సిద్ధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అమెరికాలో కూడా మంచి పోటీ నెలకొంది. అక్కడ కూడా రెండు సినిమాలని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. సాధారణంగా అయితే అక్కడ మహేష్ బాబుకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, కానీ ఈసారి త్రివిక్రమ్ సినిమాతో పోటీ పైగా మాస్ సినిమాతో రావటంతో ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు.

మహేష్ వర్సెస్ బన్నీ - ఎవరి స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది?

సరిలేరు నీకెవ్వరు కంటే అల వైకుంఠపురములో ఆడియో కి మంచి స్పందన వచ్చింది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ మీద దృష్టి సారించింది. సరిలేరు నీకెవ్వరు ప్రీమియర్ లకి 20-25 డాలర్ల మధ్య టికెట్ రేట్ పెట్టి మహేష్ బాబు ఇమేజ్ తో వసూళ్ల మోత మోగించుకోవచ్చని అక్కడి డిస్ట్రిబ్యూటర్ ప్లాన్ చేస్తున్నాడు. చాన్నాళ్ల తర్వాత భారీ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులు కూడా టికెట్ ఎంతున్నా చూస్తారని నమ్మకంగా ఉన్నారు. అల వైకుంఠపురములో టీం స్ట్రాటజీ వేరేలా ఉంది. సరిలేరు నీకెవ్వరు కి పోటీగా వెళ్తున్నారు కాబట్టి టికెట్ రేట్ ఎక్కువుంటే ప్రేక్షకులు ఆ సినిమా వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే టికెట్ రేట్ 14 డాలర్లకి ఫిక్స్ చేసారని తెలుస్తుంది. దీని ప్రీమియర్ లు శనివారం కాబట్టి రోజంతా ప్రీమియర్ లు వెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందనే దాన్ని బట్టి ఇకముందు తెలుగు సినిమాలు కూడా ప్లాన్ చేసుకునే అవకాశం లేకపోలేదు. ట్రేడ్ వర్గాలు మాత్రం రెండు సినిమాలు మంచి కలెక్షన్స్ సాధిస్తాయని నమ్మకంగా ఉన్నారు.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.