ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనని సమర్ధిస్తూ చిరంజీవి లెటర్ హెడ్ పై ఒక లేఖ పంపిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే అది ఫేక్ లెటర్ అని, ఆ విషయం గురించి తాను స్పందించలేదని చిరంజీవి పేరుతో ఒక ఫేక్ లెటర్ సర్క్యూలేట్ అయింది. అయితే అది ఫేక్ అని, మూడు రాజధానుల ప్రతిపాదనని తాను సమర్ధిస్తున్నానని స్వయంగా చిరంజీవి మీడియాకి క్లారిఫికేషన్ ఇవ్వటంతో ఆ విషయం అక్కడితో ఆగిపోయింది. ప్రభాస్ తో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ఒక భారీ సినిమా తెరకెక్కిస్తున్నాడని మరొక ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ అయింది. ప్రభాస్ సన్నిహితులు అదంతా ఫేక్ అని కొట్టిపడేసారు. ప్రస్తుతం ప్రభాస్ దృష్టి అంతా జాన్ సినిమాపైనే ఉందని, ఆ సినిమా పూర్తయిన తరువాతే వేరే ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తాడని క్లారిటీ ఇచ్చారు.
అంతే కాకుండా ప్రభాస్ కి పెళ్లి కుదిరిందని వచ్చిన ప్రచారంలో కూడా నిజం లేదని తేలింది. ఇంకా సంబంధాలు చూసే పనిలోనే ఉన్నారని, ప్రస్తుతం ప్రభాస్ స్థాయిని దృష్టిలో ఉంచుకుని సంబంధాలు చూస్తున్నారని తెలుస్తుంది. ఇవే కాకుండా మిర్చి హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదని తేలింది. ఇవన్నీ ఎక్కువ ఫాలోయర్స్ ఉన్న ప్రైవేట్ అకౌంట్స్ నుండి ప్రచారం జరిగినట్టు గుర్తించారు. మీడియా కూడా ఎప్పుడు హాట్ న్యూస్ కోసం చూస్తుండటంతో నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు ప్రచురిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్ కూడా చాలా త్వరగా వైరల్ అవుతున్నాయి. ముందు ముందు ఇలాంటి ఫేక్ న్యూస్ లు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.