Extrovert meaning in Telugu – ఎక్సట్రావర్ట్ అర్ధం తెలుగులో

✅ Fact Checked

Extrovert meaning in Telugu – ఎక్సట్రావర్ట్ అర్ధం తెలుగులో: హ్యూమన్ సైకాలజీలో ఇతరులతో ప్రవర్తించే తీరు మరియు ఆలోచన సరళిని బట్టి మనుషులను ఇంట్రావర్ట్, ఎక్సట్రావర్ట్, యాంబివర్ట్ అనే మూడు రకాలుగా విభజించారు. ఎక్సట్రావర్ట్ (ఎక్స్ట్రావర్ట్) అర్ధం మరియు వారి లక్షణాలు ఈ పోస్టులో తెలుసుకుందాం.

extrovert meaning in telugu

Extrovert meaning in Telugu – ఎక్సట్రావర్ట్ మీనింగ్ ఇన్ తెలుగు

ఎక్సట్రావర్ట్ అంటే తెలుగులో బహిర్ముఖుడు, మనసులో ఉన్నది నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి, ఆలోచనలను ఇతరులతో పంచుకునే వ్యక్తి, కొత్త వాళ్ళతో పరిచయాలను ఇష్టపడే వ్యక్తి అనే అర్ధాలు వస్తాయి. వీరికి జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్ళటం, కొత్త వ్యక్తులను మరియు ప్రదేశాలను సందర్శించటం, పరిచయం లేని వారితో కూడా గంటల తరబడి మాట్లాడటం వంటివి ఇష్టం. అతిగా మాట్లాడే తత్వం వల్ల వీరిని వాగుడుకాయ అని హేళన చేస్తుంటారు. వీరికి స్నేహితులు ఎక్కువగానే ఉంటారు. పక్కన ఎవరు లేకపోతే వీళ్ళు గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తారు.

ఎక్సట్రావర్ట్ / ఎక్స్ట్రావర్ట్ (Extrovert) = బహిర్ముఖుడు, నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి, వాగుడుకాయ

Extroverts characteristics – ఎక్సట్రావర్ట్స్ లక్షణాలు

 • ఎక్సట్రావర్ట్స్ కొత్త వ్యక్తులను కలవటానికి, కొత్త ప్రదేశాలకు వెళ్ళటానికి ఇష్టపడతారు.
 • వీళ్ళు ఏకాంతాన్ని ఇష్టపడరు. ఎప్పుడూ ఎవరో ఒకరు తమ పక్కన ఉండాలనుకుంటారు.
 • ఎక్కువమంది ఉండే ప్రదేశాలకు వెళ్ళటం, స్టేజీపై మాట్లాడటం వంటివి ఇష్టపడతారు.
 • వీరికి సృజనాత్మకత (క్రియేటివిటీ), ఊహాశక్తి, ఆలోచనాపరిధి తక్కువగా ఉంటుంది.

ఇంట్రావర్ట్స్ పార్టీలు, ఫంక్షన్ల వంటివి ఎక్కువగా ఇష్టపడతారు. అందరి మధ్యలో ఉత్సాహంగా తిరుగుతూ ఉంటారు. తమ చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలనుకుంటారు. వీరు ఒంటరిగా ఉండాల్సి వస్తే మానసికంగా కృంగిపోతారు. లాక్ డౌన్ లాంటి సమయాల్లో డిప్రెషన్ కు లోనవుతారు.

Extroverts career opportunities – ఎక్సట్రావర్ట్స్ ఎలాంటి ఉద్యోగాలలో రాణించగలరు?

ఎక్సట్రావర్ట్స్ సాధారణంగా ఎక్కువమంది మధ్య ఉండే ఉద్యోగాలు చేయాలనుకుంటారు. అందుకే భారీ స్థాయిలో, వందలు లేదా వేల మంది సహోద్యోగుల మధ్య పనిచేసే అవకాశం వస్తే వీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. లేదా రోజూ కొత్త వినియోగదారులు వచ్చే రంగాల్లో వీరు రాణించగలరు. ఈ క్రింద తెలిపిన ఉద్యోగాలలో ఎక్సట్రావర్ట్స్ ప్రతిభను నిరూపించుకోగలరు.

 • లాయర్
 • టీచర్
 • నర్స్
 • యాక్టర్
 • డాక్టర్
 • రాజకీయ నాయకులు
 • సేల్స్ మేనేజర్
 • ఈవెంట్ ప్లానర్
 • కాస్మెటోలజిస్ట్
 • టూర్ గైడ్
 • ఫైనాన్సియల్ అడ్వైసర్
 • మార్కెటింగ్ మేనేజర్
 • కౌన్సెలర్
 • కన్సల్టెంట్
 • పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
 • సోషల్ మీడియా కోఆర్డినేటర్

ఇటువంటి మరెన్నో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎక్సట్రావర్ట్స్ ప్రగతి సాధించగలరు.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment