Introvert meaning in Telugu – ఇంట్రావర్ట్ అర్ధం తెలుగులో: హ్యూమన్ సైకాలజీలో ఇతరులతో ప్రవర్తించే తీరు మరియు ఆలోచన సరళిని బట్టి మనుషులను ఇంట్రావర్ట్, ఎక్సట్రావర్ట్, యాంబివర్ట్ అనే మూడు రకాలుగా విభజించారు. ఇంట్రావర్ట్ అర్ధం మరియు వారి లక్షణాలు ఈ పోస్టులో తెలుసుకుందాం.
Introvert meaning in Telugu – ఇంట్రావర్ట్ మీనింగ్ ఇన్ తెలుగు
ఇంట్రావర్ట్ అంటే తెలుగులో అంతర్ముఖుడు, సిగ్గరి, మనసులో మాట బయటకి చెప్పని వ్యక్తి, లోలోపల ఆలోచించు వ్యక్తి, ఇతరులతో త్వరగా కలవని వ్యక్తి అనే అర్ధాలు వస్తాయి. ఇంట్రావర్ట్స్ త్వరగా ఇతరులతో తమ భావాలు, ఆలోచనలు, ప్రతిస్పందనలు తెలుపరు. వీళ్ళు ఇతరులతో కలవటానికి, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటానికి, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్ళటానికి, స్నేహితులతో సరదాగా తిరగటానికి ఇష్టపడరు. వీరికి చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారు. వారితోనే ఎక్కడికైనా వెళ్ళటానికి ఇష్టపడతారు. ఇంట్రావర్ట్స్ ఎప్పుడైనా కొత్తవారు ఇంటికి వచ్చినప్పుడు వారితో మాట్లాడటానికి ఇబ్బందిపడతారు. వీరికి పూర్తిగా నచ్చిన వ్యక్తులతో సిగ్గు పడకుండా ఎలాంటి విషయాలనైనా మాట్లాడతారు, కానీ కొత్త వ్యక్తులతో సాధారణ సంభాషణలు కూడా వీరికి ఇబ్బందిగా ఉంటాయి.
ఇంట్రావర్ట్ / ఇంట్రోవెర్ట్ (Introvert) = అంతర్ముఖుడు, సిగ్గరి, లో లోపల ఆలోచించు వ్యక్తి
Introverts characteristics – ఇంట్రావర్ట్స్ లక్షణాలు
- ఇంట్రావర్ట్స్ కొత్త వ్యక్తులను కలవటానికి, కొత్త ప్రదేశాలకు వెళ్ళటానికి ఇష్టపడరు.
- వీళ్ళు ఏకాంతాన్ని ఇష్టపడతారు. ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.
- ఎక్కువమంది ఉండే ప్రదేశాలకు వెళ్ళటం, స్టేజీపై మాట్లాడటం వంటివి ఇష్టపడరు.
- వీరికి సృజనాత్మకత (క్రియేటివిటీ), ఊహాశక్తి, ఆలోచనాపరిధి ఎక్కువగా ఉంటుంది.
ఇంట్రావర్ట్స్ పార్టీలు, ఫంక్షన్ల వంటివి ఎక్కువగా ఇష్టపడరు. తప్పనిసరి అయితే వచ్చి పక్కన నిలబడతారు. అందరి మధ్యలో ఉత్సాహంగా తిరుగుతూ ఉండాలని అనుకోరు. కానీ సామజిక మాధ్యమాల్లో (సోషల్ మీడియా) వీళ్ళు యాక్టీవ్ గా ఉండే అవకాశం ఉంది.
Introvert career opportunities – ఇంట్రావర్ట్స్ ఎలాంటి ఉద్యోగాలలో రాణించగలరు?
ఇంట్రావర్ట్స్ కు సాధారణంగా ఎక్కువమంది మధ్య ఉండే ఉద్యోగాలు ఇబ్బందిగా అనిపిస్తాయి. అందుకే ఒక గది లేదా చిన్న ఆఫీసులో తక్కువ మంది సహోద్యోగులతో కలిసి పనిచేసే ఉద్యోగాలు వీరికి ఉత్తమం. ఈ క్రింద తెలిపిన ఉద్యోగాలలో ఇంట్రావర్ట్స్ ప్రతిభను నిరూపించుకోగలరు.
- సాఫ్ట్ వేర్ ఇంజనీర్
- సైకియాట్రిస్ట్
- ఆర్కిటెక్ట్
- సైకాలజిస్ట్
- ఇంజినీర్
- టెక్నికల్ రైటర్
- అకౌంటెంట్
- సైంటిస్ట్
- రైటర్
- వీడియో ఎడిటర్
- లైబ్రేరియన్
- గ్రాఫిక్ డిజైనర్
- ఆర్టిస్ట్
ఇటువంటి మరెన్నో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఇంట్రావర్ట్స్ ప్రగతి సాధించగలరు.