Deserve meaning in Telugu – డిసర్వ్ అర్థం తెలుగులో

✅ Fact Checked

Deserve meaning in Telugu – డిసర్వ్ అర్థం తెలుగులో: డిసర్వ్ అనే పదాన్ని ఇంగ్లీషులో చాలా సందర్భాలలో ఉపయోగిస్తుంటారు. సాధారణంగా డిసర్వ్ అంటే అర్హత కలిగి ఉండటం అనే అర్ధం వస్తుంది. ఈ పదం యొక్క అర్ధాలు, ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలి, మరియు ఉదాహరణలు ఈ పోస్టులో తెలియజేస్తున్నాము.

Deserve meaning in Telugu

Deserve meaning in Telugu – డిసర్వ్ అంటే ఏమిటి?

డిసర్వ్ (deserve, deserves, deserved, deserving) అనే పదాన్ని ఏదైనా వస్తువులు లేదా వ్యక్తులను దక్కించుకునే స్థాయి గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తారు. అందుకే ఈ పదం విలాసవంతమైన జీవితం, ఖరీదైన వస్తువులు, అందమైన స్త్రీలు, మరియు అత్యున్నత ఉద్యోగాల విషయంలో వాడతారు. ఆ వస్తువులు, అవకాశాలు, లేదా వ్యక్తులు ఒక స్థాయి మరియు అర్హత కలిగిన వారికి మాత్రమే దక్కాలనే అర్ధం వచ్చేలా డిసర్వ్ అనే పదం సందర్భానుసారం వస్తుంది.

డిసర్వ్ (Deserve) = అర్హత కలిగి ఉండటం

ఈ పదాన్ని వాక్యాల్లో ఎలా ఉపయోగించాలో తెలియాలంటే క్రింద ఉన్న ఉదాహరణలు చుడండి.

Deserved meaning in Telugu – డిసర్వ్డ్ అంటే ఏమిటి?

డిసర్వ్డ్ అనే పదం డిసర్వ్ యొక్క పాస్ట్ టెన్స్ లో ఉపయోగిస్తారు. అంటే గతంలో అర్హత కలిగి ఉన్నారు కానీ ఇప్పుడు అర్హత లేదు అని చెప్పటానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు.

డిసర్వ్డ్ (Deserved) = గతంలో అర్హత కలిగి ఉన్నారు

Deserving meaning in Telugu – డిసర్వింగ్ అంటే ఏమిటి?

డిసర్వింగ్ అంటే డిసర్వ్ యొక్క ప్రెజెంట్ పార్టిసిపుల్ (Present Participle). ప్రస్తుతం అర్హత కలిగి ఉన్నారని చెప్పటానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు. అంటే ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు.

డిసర్వింగ్ (Deserving) = ప్రస్తుతం అర్హత కలిగి ఉన్నారు

You deserve it meaning in Telugu – యు డిసర్వ్ ఇట్ అంటే ఏమిటి?

యు డిసర్వ్ ఇట్ (You deserve it or U deserve it) అంటే నీకు దానిని పొందే అర్హత ఉంది అని అర్ధం. అలాగే యు డిసర్వ్ హిమ్ (You deserve him) అంటే నీకు అతనిని పొందే అర్హత ఉంది, మరియు యు డిసర్వ్ హర్ (You deserve her) అంటే నీకు ఆమెను పొందే అర్హత ఉంది అని అర్ధాలు వస్తాయి. ఇక్కడ పొందటం లేదా దక్కించుకోవటం అంటే బహుమతిగా తీసుకోవటం, ప్రేమించటం, లేదా పెళ్లి చేసుకోవటం కావచ్చు. సందర్భానుసారం ఎవరి గురించి మాట్లాడుతున్నామో వారికి తగ్గట్లు అర్ధం మారిపోతుంది.

You don’t deserve it meaning in Telugu – యు డోంట్ డిసర్వ్ ఇట్ అంటే ఏమిటి?

ఇది యు డిసర్వ్ ఇట్ కు వ్యతిరేక పదం. యు డోంట్ డిసర్వ్ ఇట్ (You don’t deserve it) అంటే నీకు దానిని పొందే అర్హత లేదు అని అర్ధం. అలాగే యు డోంట్ డిసర్వ్ హిమ్ (You don’t deserve him) అంటే నీకు అతనిని పొందే అర్హత లేదు, మరియు యు డోంట్ డిసర్వ్ హర్ (You don’t deserve her) అంటే నీకు ఆమెను పొందే అర్హత లేదు అని అర్ధాలు వస్తాయి. ఐ డోంట్ డిసర్వ్ ఇట్ (I don’t deserve it) అంటే నాకు దానిని పొందే అర్హత లేదు అని అర్ధం.

యు డోంట్ డిసర్వ్ మీ (You don’t deserve me) అంటే నీకు నన్ను పొందే అర్హత లేదు అని అర్ధం. హి డస్ నాట్ డిసర్వ్ మీ (He doesn’t deserve me) అంటే అతనికి నన్ను పొందే అర్హత లేదు అని అర్ధం. యు గెట్ వాట్ యు డిసర్వ్ (You get what you deserve) అంటే ఏదైనా నీ అర్హత (లేదా స్థాయి) కి తగ్గట్లే దొరుకుతుంది అని అర్ధం.

Deserve meaning in Telugu with examples

డిసర్వ్ అంటే పదాన్ని వాక్యాలలో ఎలా ఉపయోగించాలో క్రింద ఉన్న ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు.

  • I deserve a better salary – నేను ఎక్కువ జీతం పొందేందుకు అర్హుడను (నేను చేస్తున్న పనికి, పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభించటంలేదు అనే అర్ధం వస్తుంది).
  • They deserve to win – వాళ్ళు గెలవటానికి అర్హత కలిగి ఉన్నారు (వాళ్ళు పడుతున్న కష్టానికి లేదా వాళ్ళ ప్రతిభకు విజయం సాదించాలి అని అర్ధం).
  • He doesn’t deserve me – అతనికి నన్ను పొందే అర్హత లేదు (అతని స్థాయికి లేదా వ్యక్తిత్వానికి నేను చాలా ఎక్కువ అని అర్ధం).
  • I don’t deserve it – నాకు ఇది పొందే అర్హత లేదు (ఇది కష్టపడకుండా వచ్చిన ప్రతిఫలం లేదా తప్పు చేయకుండా వచ్చిన కష్టాలు రెండిటికి ఉపయోగించవచ్చు).

ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment