Crush meaning in Telugu – క్రష్ మీనింగ్ ఇన్ తెలుగు: క్రష్ (Crush) అనే పదానికి సందర్భాన్ని బట్టి రెండు రకాల అర్ధాలు ఉంటాయి. సాధారణంగా క్రష్ అంటే నలిపేయడం అనే అర్ధం వస్తుంది. అలాగే ఇష్టపడే వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు కూడా క్రష్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. క్రష్ అనే పదానికి అర్ధాలు, సందర్భం, మరియు ఉదాహరణలు ఈ పోస్టులో తెలుసుకోండి.

Crush meaning in Telugu – తెలుగులో క్రష్ అంటే అర్థం
ఇంతకుముందు చెప్పుకున్నట్లు క్రష్ అనే పదానికి సందర్భానుసారం రెండు రకాల అర్ధాలు ఉన్నాయి. ముందుగా సాధారణంగా క్రష్ అంటే అర్ధం ఏంటో తెలుసుకుందాము.
క్రష్ అంటే ఏమిటి?
క్రష్ (Crush) = నలిపివేయటం, పగలకొట్టడం, అణచివేయడం, తొక్కేయడం, చితక్కొట్టడం, ఎదగకుండా చేయడం, చూర్ణం చేయడం
అలాగే క్రష్ అంటే లవ్ విషయంలో ఇంకొక అర్ధం ఉంది. సోషల్ మీడియాలో తరచుగా ఇదే అర్ధంతో క్రష్ అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు.
ప్రేమకు సంబంధించి క్రష్ అంటే ఏమిటి?
క్రష్ (Crush meaning in Telugu – related to Love) = ప్రేమించటం, అభిమానించటం, ఇష్టపడటం
Verb forms of Crush
- Infinitive: Crush (క్రష్)
- Present Tense: Crushes (క్రషెస్)
- Present participle: Crushing (క్రషింగ్)
- Past Tense: Crushed (క్రషెడ్)
- Past Participle: Crushed (క్రషెడ్)
Crush the bottle after use meaning in Telugu
క్రష్ ది బాటిల్ ఆఫ్టర్ యూజ్ (Crush the bottle after use) = సీసా లేదా డబ్బాని ఉపయోగించిన తరువాత నలిపివేయండి
Crushed meaning in Telugu
క్రషెడ్ (Crushed) = నలిపివేయబడింది, పగలకొట్టబడింది, అణచివేయబడింది, చూర్ణం చేయబడింది
Crush meaning in Love – క్రష్ మీనింగ్ ఇన్ లవ్
ఒక వ్యక్తిని అమితంగా ఇష్టపడితే వారిని క్రష్ అని సంబోధిస్తారు. ఇది సాధారణంగా వన్ సైడ్ లవ్ విషయంలో ఉపయోగిస్తారు. క్రష్ అనే పదానికి తెలుగులో సరైన నిర్వచనం లేదు. అలాగే క్రష్ అనే పదానికి వయోభేదం మరియు లింగభేదం లేవు. అంటే ఏ వయసు వారి మీదైనా ఇష్టం లేదా వ్యామోహం ఉంటే వారిని మీ క్రష్ అని పిలవవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే క్రష్ అనే పదాన్ని కేవలం శృంగార పరమైన ఇష్టం కోసమే ఉపయోగిస్తారు. మీరు ఇష్టపడే కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల విషయంలో ఈ పదాన్ని ఉపయోగించకూడదు. ఏదైనా వాక్యంలో ఉపయోగించేటప్పుడు ఆ వ్యక్తి నా క్రష్ లేదా ఆ వ్యక్తిపై నాకు క్రష్ ఉంది అని చెప్పవచ్చు. ప్రేమ విషయంలో క్రష్ అనే పదాన్ని నౌన్ మరియు వెర్బ్ రెండిటిలో ఉపయోగిస్తారు. కానీ, వేరే విషయాల్లో కేవలం వెర్బ్ గానే ఉపయోగిస్తారు.
First crush meaning in Telugu – ఫస్ట్ క్రష్ మీనింగ్ ఇన్ తెలుగు
ఫస్ట్ క్రష్ (First Crush) అంటే మీ జీవితంలో మొట్టమొదటిసారి అమితంగా ఇష్టపడిన లేదా వ్యామోహపడిన వ్యక్తులు. ఈ పదాన్ని తొలిప్రేమ అనే అర్ధం వచ్చేలా ఉపయోగిస్తారు. ఉదాహరణకు మీరు ఎవరైనా హీరో లేదా హీరోయిన్ ను స్కూల్ లో చదివే రోజుల నుండి ఇష్టపడితే, దానికి ప్రేమ అనటం కంటే క్రష్ అనటం సమంజసం. అలాగే స్కూల్ టీచర్స్, స్నేహితులు, సెలెబ్రిటీలు ఎవరినైనా ప్రేమిస్తుంటే క్రష్ అని చెప్పవచ్చు.
Secret crush meaning in Telugu – సీక్రెట్ క్రష్ మీనింగ్ ఇన్ తెలుగు
సీక్రెట్ క్రష్ (Secret Crush) అంటే మీరు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఇష్టపడే వ్యక్తులు. సాధారణంగా క్రష్ అంటే వన్ సైడ్ లవ్ తో సమానం కాబట్టి స్నేహితులతో చెప్తారు. ఒకవేళ ఎవరికీ చెప్పకుండా ఇష్టపడితే సీక్రెట్ క్రష్ అనవచ్చు. ఉదాహరణకు ఒక క్లాస్ లో నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ఇష్టపడి ఆ విషయాన్నీ ఎవరికీ చెప్పకుండా దాచిపెడితే, ఆ అమ్మాయి వాళ్లందరికీ సీక్రెట్ క్రష్ అవుతుంది.
You are my crush meaning in Telugu – యు ఆర్ మై క్రష్ మీనింగ్ ఇన్ తెలుగు
యు ఆర్ మై క్రష్ అంటే నువ్వంటే నాకిష్టం అనే అర్ధం వస్తుంది. ఒకరకంగా ఇది ఐ లవ్ యు తో సమానం. కానీ దీన్ని ప్రేమ కంటే ఇష్టాన్ని వ్యక్తపరచడానికి ఎక్కువ ఉపయోగిస్తారు. క్రష్ అంటే ప్రేమ అవ్వాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మహేష్ బాబును సినిమాలలో చూసి చాలా మంది అమ్మాయిలు ఇష్టపడవచ్చు. కానీ అది క్రష్ మాత్రమే, దాన్ని ప్రేమ అని పిలవలేము.
Crush examples with meaning in Telugu
క్రష్ అనే పదాన్ని రోజువారీ సంభాషణల్లో ఎలా ఉపయోగించవచ్చో క్రింద తెలిపిన ఉదాహరణలలో చూడవచ్చు.
- I have a crush on you – నువ్వంటే నాకిష్టం
- Sridevi was my first crush – నేను మొదటిసారి ఇష్టపడింది శ్రీదేవిని.
- It was just a schoolgirl crush – అది కేవలం స్కూల్ డేస్ లో కలిగిన వ్యామోహం.
- He always had a crush on me – అతను ఎప్పుడూ నాపై మోజు పడేవాడు.
- Don’t crush the bottle – బాటిల్ ను నలిపేయవద్దు.
- Crush it until it becomes powder – దీన్ని పొడి అయ్యేవరకు నలగగొట్టు.
ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.