Bawaal, Bavaal, Bawal, Bahara, Gunga, Andha, Yarana, Rabba Ve, Chokri meaning in Telugu

✅ Fact Checked

Bawaal, Bavaal, Bawal, Bahara, Gunga, Andha, Yarana, Rabba Ve, Chokri meaning in Telugu: కొన్ని హిందీ లేదా ఏదైనా ప్రాంతీయ భాషలోని పదాలు సినిమాలు, రాజకీయాలు, సామాజిక మాధ్యమాలు లేదా వేరే ఏదైనా మాధ్యమం ద్వారా వాడుక భాషలోకి వస్తాయి. ప్రస్తుతం గూగుల్ లో వెతుకుతున్న కొన్ని హిందీ పదాల అర్థాలను తెలుగు లో తెలుసుకుందాం. ఈ పోస్ట్ లో బవాల్ (Bawaal, Bavaal), బవల్ (Bawal), బహరా (Bahara), గూంగా (Gunga), అంధా (Andha), యారానా (Yarana), రబ్బా వే (Rabba Ve), మరియు చోక్రి (Chokri) అనే పదాల అర్ధాలు తెలియజేస్తున్నాము.

bawaal meaning in telugu

Bawaal, Bavaal meaning in Telugu – బవాల్ అర్థం తెలుగులో

బవాల్ (बवाल) అనేది ఒక హిందీ పదం. బవాల్ (Bawaal, Bavaal) అంటే తెలుగులో గలాటా, గొడవ, కొట్లాట అనే అర్థాలు వస్తాయి. ఈ పదాన్ని ఇద్దరు వ్యక్తులు, రెండు గుంపులు, లేదా రెండు వర్గాల మధ్య జరిగే కొట్లాటలని ఉద్దేశించి వాడుతారు. సాధారణంగా ఇలాంటి గొడవల్లో చూడటానికి చుట్టూ జనం గుమిగూడి ఉంటారు. ఈ కొట్లాటల్లో అరుపులు, పిడిగుద్దులు, వస్తువులను ధ్వంసం చేయడం, రాళ్ళు విసురుకోవడం వంటివి ఉంటాయి.

బవాల్ (Bawaal, Bavaal, बवाल) = గలాటా, గొడవ, కొట్లాట

Bawal meaning in Telugu – బవల్ మీనింగ్ ఇన్ తెలుగు

Bawal (బవల్) అనేది హర్యానా రాష్ట్రం లోని ఒక ఊరు. ఈ బవల్ అనే ఊరు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) పరిధిలో కలదు.

Bawal (బవల్) = హర్యానా రాష్ట్రం లోని ఒక ఊరు

Bahara, Gunga, Andha meaning in Telugu – బహరా, గూంగా, అంధా పదాల అర్థాలు తెలుగులో

బహరా (बहरा), గూంగా (गूंगा), అంధా (अन्ध) అనేవి హిందీ పదాలు. బహరా (Bahara) అంటే తెలుగులో చెవుడు, చెవిటి అని అర్థం వస్తుంది. గూంగా (Gunga) అంటే తెలుగులో మూగ అని అర్థం. అంధా (Andha) అంటే తెలుగులో గుడ్డి అని అర్థం వస్తుంది. అంధాధున్ అంటే గుడ్డిగా, మొండిగా అని అర్థాలు వస్తాయి. అంధాధున్ పేరుతో ఇటీవలి కాలంలో ఒక సూపర్ హిట్ హిందీ సినిమా వచ్చింది.

బహరా (Bahara, बहरा) = చెవుడు, చెవిటి

గూంగా (Gunga, गूंगा) = మూగ

అంధా (Andha, अन्ध) = గుడ్డి

అంధాధున్ (Andhadhun, अंधाधुन) = గుడ్డిగా, మొండిగా

Yarana meaning in Telugu – యారానా అర్థం తెలుగులో

యారానా (याराना) అనేది హిందీ పదం. యారానా (Yarana) అంటే స్నేహం, సాన్నిహిత్యం, దోస్తీ అనే అర్ధాలు వస్తాయి. విడిపోయిన స్నేహితుల గురించి మాట్లాడేటప్పుడు యారానా అనే పదాన్ని వాడరు. యారానా పదం వాడినప్పుడు ఆ స్నేహం ఇంకా కొనసాగుతూనే ఉంది అని అర్థం వస్తుంది.

యారానా (Yarana, याराना) = స్నేహం, సాన్నిహిత్యం, దోస్తీ

Rabba Ve meaning in Telugu – రబ్బా వే అర్థం తెలుగులో

రబ్బా వే (रब्बा वे) అనేది ఒక పంజాబీ పదం. ఈ పదాన్ని పంజాబీ తో పాటు హిందీలో కూడా ఎక్కువగా వాడుతారు. రబ్బా అంటే దేవుడు అని అర్థం. బాలీవుడ్ లో పాటలలో పంజాబీ పదాలు సర్వసాధారణంగా ఉపయోగిస్తారు. అందువల్ల బాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళు ఈ పదం వినే ఉంటారు. రబ్బా వే (Rabba Ve) అంటే తెలుగులో ఓ దేవుడా, ఓరి దేవుడా, ఓ స్వామి అనే అర్థాలు వస్తాయి. ఈ పదాన్ని భక్తి గీతాల్లో, ఊత పదంలా, లేదా వ్యంగ్యంగా ఉపయోగిస్తారు.

రబ్బా వే (Rabba Ve, रब्बा वे) = ఓ దేవుడా, ఓరి దేవుడా, ఓ స్వామి

Chokri meaning in Telugu – చోక్రి అర్ధం తెలుగులో

చోక్రి (छोकरी) అనేది ఒక హిందీ పదం. చోక్రి (chokri) అంటే తెలుగులో అమ్మాయి, పిల్ల, పోరి లాంటి అర్ధాలు వస్తాయి. ఈ పదాన్ని పెళ్లికాని అమ్మాయిలని ఉద్దేశించి ఉపయోగిస్తారు. ఇది వాడుక భాషలో ఉపయోగించే పదం. దీన్ని అధికారిక సంభాషణల్లో ఉపయోగించకూడదు. ఎవరినైనా చోక్రి అని పిలిస్తే “ఏయ్ పిల్లా” లేదా “ఏయ్ పోరి” అని అర్ధం వస్తుంది. అందువల్ల తెలియని వాళ్ళని ఉద్దేశించి ఇలాంటి పదాలు వాడకపోవడం మంచిది.

చోక్రి (Chokri, छोकरी) = అమ్మాయి, పిల్ల, పోరి

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment