Visuchika Nivarana Mantra (Yoga Vasistham) pdf download – విషూచికా మంత్ర కథనం (యోగవాసిష్ఠం)

✅ Fact Checked

శ్రీ వసిష్ఠ ఉవాచ |
అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ |
దారుణం హి తపః సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః || 1 ||
అర్థం – శ్రీవసిష్ఠుడు పలికెను: (కర్కటి తపస్సు చేయు) వేయి సంవత్సరముల తరువాత పితామహుడు (బ్రహ్మగారు), దారుణమగు తపస్సును సిద్ధింపజేయుటకు విషాగ్నిని చల్లబరచు శీతలము వలె వచ్చెను.
మనసైవ ప్రణంయైనం సా తథైవ స్థితా సతీ |
కో వరః క్షుచ్ఛమాయాఽలమితి చింతాన్వితాఽభవత్ || 2 ||
అర్థం – (బ్రహ్మగారికి) మనస్సులోనే ప్రణామము చేసి తన స్థితినుంచి కదలక, ఏమి వరము కోరుకోవలెనోయని చింతన చేయుచుండెను.
ఆ స్మృతం ప్రార్థయిష్యేఽహం వరమేకమిమం విభుం |
అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా || 3 ||
అర్థం – విభునకు ప్రార్థనచేసి కోరుకోవలసిన వరము గుర్తుకు వచ్చినది. మృదువుగా కాక ఇనుమువలె గట్టిగా, జీవులలోనికి చొచ్చుకుపోగల సూదిమొన వలె అయ్యెదను అని అనుకొనెను.
అస్యోక్త్యా ద్వివిధా సూచిర్భూత్వా లక్ష్యా విశాంయహం |
ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా || 4 ||
అర్థం – “నేను సూచి (సూదిమొన) రూపముతో కనిపించకుండా ప్రాణులన్నిటిలోని హృదయములోనికి, (నాసికములోనికి వెళ్ళు పుష్ప) సౌరభము వలె, చొచ్చుకుపోయెదను”.
యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ |
క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం || 5 ||
అర్థం – “నా అభిమతము మేర ఈ సకల జగత్తును (ప్రాణులను) గ్రసించి, ఆ క్రమములో నా ఆకలిని తీర్చుకొని, ఆకలి తీరినది కనుక పరమసుఖమును పొందెదను.”
ఇతి సంచింతయంతీం తామువాచ కమలాలయః |
అన్యాదృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం || 6 ||
అర్థం – ఇలా (కర్కటి) ఆలోచనచేయుచూ ఉండగా, కమలాలయుడు (కమలమునందు ఉండువాడు) ఆమె చెడు ఉద్దేశ్యములను పసిగట్టి, ఉరుముతున్న మబ్బులవంటి కంఠముతో ఇట్లు పలికెను.
బ్రహ్మోవాచ |
పుత్రి కర్కటికే రక్షఃకులశైలాభ్రమాలికే |
ఉత్తిష్ఠ త్వం తు తుష్టోఽస్మి గృహాణాభిమతం వరం || 7 ||
అర్థం – బ్రహ్మదేవుడు పలికెను : పుత్రీ కర్కటీ ! రాక్షసకుల పర్వతము పైనున్న మేఘము వంటి నీవు, పైకి లే. (నీ తపముచే నేను) సంతుష్టుడనైతిని. నీకు కావలసిన వరము కోరుకొనుము.
కర్కట్యువాచ |
భగవన్ భూతభవ్యేశ స్యామహం జీవసూచికా |
అనాయసీ చాయసీ చ విధేఽర్పయసి చేద్వరం || 8 ||
అర్థం – కర్కటి పలికెను : భూత భవిష్యత్తులను శాసించగల భగవంతుడా, నేను జీవసూచిగా మారునటుల, మృదువుగా కాక ఇనుమువలె కఠినముగా అగునటుల వరమును ఇవ్వుము.
శ్రీవసిష్ఠ ఉవాచ |
ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః |
సూచికా సోపసర్గా త్వం భవిష్యసి విషూచికా || 9 ||
అర్థం – శ్రీవసిష్ఠుడు పలికెను : “అటులనే అగుగాక” అని పితామహుడు పలికుచూ, “సూచికా రూపములో బాధపెట్టుచూ నీవు విషూచికా అయ్యెదవు”.
సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి |
దుర్భోజనా దురారంభా మూర్ఖా దుఃస్థితయశ్చ యే || 10 ||
అర్థం – “సూక్ష్మముగా మాయవలె సర్వలోకములను హింస చేయుము. ముఖ్యముగా, చెడు భోజనములు చేయువారు, చెడుపనులను ఆరంభము చేయువారలను, మూర్ఖులను మరియు దుస్థితులయందు ఉన్నవారిని హింసించుము.”
దుర్దేశవాసినో దుష్టాస్తేషాం హింసాం కరిష్యసి |
ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాది బాధనాత్ || 11 ||
అర్థం – “దుష్టమైన ప్రదేశములలో ఉన్నవారిని, దుష్టులను నీవు హింసింపుము. ప్రాణుల హృదయమునందు ప్రవేశించి ప్లీహాది బాధలను కలించుము.”
వాతలేఖాత్మికా వ్యాధిర్భవిష్యసి విషూచికా |
సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి || 12 ||
అర్థం – “వాతాది వ్యాధులను కలిగించు విషూచికా, మంచి గుణములు మరియు చెడు గుణములు కలిగిన జనులపైకూడా ప్రభావము చూపుము.”
గుణాన్వితచికిత్సార్థం మంత్రోఽయం తు మయోచ్యతే |
అర్థం – “నీ గుణములచే ప్రభావితమైన వారి చికిత్స కొరకు ఈ మంత్రమును నేను చెప్పెదను”.
బ్రహ్మోవాచ |
హిమద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసీ || 13 ||
విషూచికాఽభిధానా సా నాంనాప్యన్యాయబాధికా |
అర్థం – బ్రహ్మదేవుడు పలికెను : హిమాద్రి యొక్క ఉత్తరభాగములో ఉండు కర్కటీ అనే పేరు గల రాక్షసియొక్క విషూచికా అని పిలవబడే అన్యాయ బాధ (నుండి ముక్తికొరకు ఈ మంత్రము)
తస్యా మంత్రః |
ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణుశక్తయే నమః |
ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్ఛ జీవ సః సః సః చంద్రమండల గతోఽసి స్వాహా |
అర్థం – విష్ణువు యొక్క హ్రీం, హ్రాం, రీం, రాం అను శక్తులను నమస్కరిస్తున్నాను. ఆ విష్ణు శక్తులు (విషూచికా ప్రభావమును) హరించి, తీసుకువెళ్ళి, కాల్చి, చిలికి, నాశనము చేయుచూ దూరము చేసి, హిమలయములలోకి పంపుతూ (ఆ జీవసూచికను) చంద్రమండలములోకి పంపుగాక.
ఇతి మంత్రీ మహామంత్రం న్యస్య వామకరోదరే |
మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః || 14 ||
అర్థం – ఈ మహామంత్రమును మంత్రి (మంత్రసిద్ధి కలిగినవారు) యొక్క ఎడమ అరచేతిలో న్యాసము చేసి, ఆ హస్తముతో బాధకలుగు ప్రదేశములో మర్దన చేయవలెను.
హిమశైలాభిముఖ్యేన విద్రుతాం తాం విచింతయేత్ |
కర్కటీ కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం || 15 ||
అర్థం – హిమశైలాభిముఖమైన (విషూచికా) బాధ తగ్గినట్టు, కర్కటియొక్క కర్కశమైన ఆక్రందనలు, ఈ మంత్రము అనే సంమెట క్రింద నలిగినట్లు భావించవలెను.
ఆతురం చింతయేచ్చంద్రే రసాయనహృదిస్థితం |
అజరామరణం యుక్తం ముక్తం సర్వాధివిభ్రమైః || 16 ||
అర్థం – రోగి కూడా చంద్రుని యందు ఉన్న రసాయనము (ఔషధము) తన హృదయమునందు ఉన్నట్టు, ముసలితనము మరణము లేని ముక్తిని పొందినట్టు భావించవలెను.
సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతః సుసమాహితః |
క్రమేణానేన సకలాం ప్రోచ్ఛినత్తి విషూచికాం || 17 ||
అర్థం – సాధకుడు శుచిగా, సమాహిత మనస్సుతో సాధన చేసిన, క్రమముగా విషూచికా బాధను పూర్తిగా నిర్మూలించగలడు.
ఇతి గగనగతస్త్రిలోకనాథః
గగనగసిద్ధగృహీత సిద్ధమంత్రః |
గత ఉపగతశక్రవంద్యమానో
నిజపురమక్షయమాయముజ్జ్వలశ్రీః || 18 ||
అర్థం – ఇటుల ఉపదేశించి ఆకాశమార్గమున అంతర్ధానమైన త్రిలోకనాథుడు, ఆకాశమార్గమునందు ఉన్న సిద్ధులు కూడా ఈ సిద్ధమంత్రమును తీసుకొనగా, శక్రుడు (ఇంద్రుడు) వందనము చేయుచుండగా, అక్షయము, ఉజ్జ్వలము అయిన తన నిజపురమునకు యేగెను.
ఇత్యార్షే శ్రీవాసిష్ఠమహారామాయణే వాల్మీకీయే ఉత్పత్తిప్రకరణే విషూచికామంత్ర కథనం నామ ఏకోనసప్తతితమస్సర్గః |
(ఈ అర్థము శ్రీ మండా కృష్ణశ్రీకాంత శర్మకు స్ఫురించి వ్రాయబడినది.)

Also Read  Sri Bala Sahasranamavali 1 pdf download – శ్రీ బాలా సహస్రనామావళిః 1

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment