శ్రీమాన్వేంకటనాథార్యః కవితార్కిక కేసరీ |
వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది ||
వందే బృందావనచరం వల్లవీజనవల్లభం |
జయంతీసంభవం ధామ వైజయంతీవిభూషణం || 1 ||
వాచం నిజాంకరసికాం ప్రసమీక్షమాణో
వక్త్రారవిందవినివేశితపాంచజన్యః |
వర్ణత్రికోణరుచిరే వరపుండరీకే
బద్ధాసనో జయతి వల్లవచక్రవర్తీ || 2 ||
ఆంనాయగంధిరుదితస్ఫురితాధరోష్ఠం
ఆస్రావిలేక్షణమనుక్షణమందహాసం |
గోపాలడింభవపుషం కుహనాజనన్యాః
ప్రాణస్తనంధయమవైమి పరం పుమాంసం || 3 ||
ఆవిర్భవత్వనిభృతాభరణం పురస్తాత్
ఆకుంచితైకచరణం నిభృతాన్యపాదం |
దధ్నా నిమంథముఖరేణ నిబద్ధతాళం
నాథస్య నందభవనే నవనీతనాట్యం || 4 ||
హర్తుం కుంభే వినిహితకరః స్వాదు హైయంగవీనం
దృష్ట్వా దామగ్రహణచటులాం మాతరం జాతరోషాం |
పాయాదీషత్ ప్రచలితపదో నాపగచ్ఛన్ న తిష్ఠన్
మిథ్యాగోపః సపది నయనే మీలయన్ విశ్వగోప్తా || 5 ||
వ్రజయోషిదపాంగవేధనీయం
మధురాభాగ్యమనన్యభోగ్యమీడే |
వసుదేవవధూస్తనంధయం తత్
కిమపి బ్రహ్మ కిశోరభావదృశ్యం || 6 ||
పరివర్తితకంధరం భయేన
స్మితఫుల్లాధరపల్లవం స్మరామి |
విటపిత్వనిరాసకం కయోశ్చిత్
విపులోలూఖలకర్షకం కుమారం || 7 ||
నికటేషు నిశామయామి నిత్యం
నిగమాంతైరధునాఽపి మృగ్యమాణం |
యమళార్జునదృష్టబాలకేళిం
యమునాసాక్షికయౌవనం యువానం || 8 ||
పదవీమదవీయసీం విముక్తేః
అటవీసంపదమంబువాహయంతీం |
అరుణాధరసాభిలాషవంశాం
కరుణాం కారణమానుషీం భజామి || 9 ||
అనిమేషనిషేవణీయమక్ష్ణోః
అజహద్యౌవనమావిరస్తు చిత్తే |
కలహాయితకుంతలం కలాపైః
కరుణోన్మాదకవిభ్రమం మహో మే || 10 ||
అనుయాయిమనోజ్ఞవంశనాళైః
అవతు స్పర్శితవల్లవీవిమోహైః |
అనఘస్మితశీతలైరసౌ మాం
అనుకంపాసరిదంబుజైరపాంగైః || 11 ||
అధరాహితచారువంశనాళాః
మకుటాలంబిమయూరపింఛమాలాః |
హరినీలశిలావిభంగనీలాః
ప్రతిభాః సంతు మమాంతిమప్రయాణే || 12 ||
అఖిలానవలోకయామి కాలాన్
మహిళాధీనభుజాంతరస్య యూనః |
అభిలాషపదం వ్రజాంగనానాం
అభిలాపక్రమదూరమాభిరూప్యం || 13 ||
హృది ముగ్ధశిఖండమండనో
లిఖితః కేన మమైష శిల్పినా |
మదనాతురవల్లవాంగనా-
-వదనాంభోజదివాకరో యువా || 14 ||
మహసే మహితాయ మౌళినా
వినతేనాంజలిమంజనత్విషే |
కలయామివిముగ్ధవల్లవీ-
-వలయాభాషితమంజువేణవే || 15 ||
జయతి లలితవృత్తిం శిక్షితో వల్లవీనాం
శిథిలవలయశింజాశీతలైర్హస్తతాళైః |
అఖిలభువనరక్షాగోపవేషస్య విష్ణోః
అధరమణిసుధాయామంశవాన్ వంశనాలః || 16 ||
చిత్రాకల్పః శ్రవసి కలయన్ లాంగలీకర్ణపూరం
బర్హోత్తంసస్ఫురితచికురో బంధుజీవం దధానః |
గుంజాబద్ధామురసి లలితాం ధారయన్ హారయష్టిం
గోపస్త్రీణాం జయతి కితవః కోఽపి కౌమారహారీ || 17 ||
లీలాయష్టిం కరకిసలయే దక్షిణే న్యస్య ధన్యాం
అంసే దేవ్యాః పులకరుచిరే సన్నివిష్టాన్యబాహుః |
మేఘశ్యామో జయతి లలితో మేఖలాదత్తవేణుః
గుంజాపీడస్ఫురితచికురో గోపకన్యాభుజంగః || 18 ||
ప్రత్యాలీఢస్థితిమధిగతాం ప్రాప్తగాఢాంకపాళిం
పశ్చాదీషన్మిళితనయనాం ప్రేయసీం ప్రేక్షమాణః |
భస్త్రాయంత్రప్రణిహితకరో భక్తజీవాతురవ్యాత్
వారిక్రీడానిబిడవసనో వల్లవీవల్లభో నః || 19 ||
వాసో హృత్వా దినకరసుతాసన్నిధౌ వల్లవీనాం
లీలాస్మేరో జయతి లలితామాస్థితః కుందశాఖాం |
సవ్రీడాభిస్తదను వసనే తాభిరభ్యర్థ్యమానే
కామీ కశ్చిత్ కరకమలయోరంజలిం యాచమానః || 20 ||
ఇత్యనన్యమనసా వినిర్మితాం
వేంకటేశకవినా స్తుతిం పఠన్ |
దివ్యవేణురసికం సమీక్షతే
దైవతం కిమపి యౌవతప్రియం || 21 ||
ఇతి శ్రీవేదాంతాదేశికాచార్య కృత శ్రీ గోపాల వింశతిః ||
Sri Gopala Vimsathi pdf download – శ్రీ గోపాల వింశతిః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



