మాణిక్యాంచితభూషణాం మణిరవాం మాహేంద్రనీలోజ్జ్వలాం
మందారద్రుమమాల్యభూషితకుచాం మత్తేభకుంభస్తనీం |
మౌనిస్తోమనుతాం మరాళగమనాం మాధ్వీరసానందినీం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికాం || 1 ||
శ్యామాం రాజనిభాననాం రతిహితాం రాజీవపత్రేక్షణాం
రాజత్కాంచనరత్నభూషణయుతాం రాజ్యప్రదానేశ్వరీం |
రక్షోగర్వనివారణాం త్రిజగతాం రక్షైకచింతామణిం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికాం || 2 ||
కల్యాణీం కరికుంభభాసురకుచాం కామేశ్వరీం కామినీం
కల్యాణాచలవాసినీం కలరవాం కందర్పవిద్యాకలాం |
కంజాక్షీం కలబిందుకల్పలతికాం కామారిచిత్తప్రియాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికాం || 3 ||
భావాతీతమనఃప్రభావభరితాం బ్రహ్మాండభాండోదరీం
బాలాం బాలకురంగనేత్రయుగళాం భానుప్రభాభాసితాం |
భాస్వత్క్షేత్రరుచాభిరామనిలయాం భవ్యాం భవానీం శివాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికాం || 4 ||
వీణాగానవినోదినీం విజయినీం వేతండకుంభస్తనీం
విద్వద్వందితపాదపద్మయుగళాం విద్యాప్రదాం శాంకరీం |
విద్వేషిణ్యభిరంజినీం స్తుతివిభాం వేదాంతవేద్యాం శివాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికాం || 5 ||
నానాభూషితభూషణాదివిమలాం లావణ్యపాథోనిధిం
కాంచీచంచలఘంటికాకలరవాం కంజాతపత్రేక్షణాం |
కర్పూరాగరుకుంకుమాంకితకుచాం కైలాసనాథప్రియాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికాం || 6 ||
మంజీరాంచితపాదపద్మయుగళాం మాణిక్యభూషాన్వితాం
మందారద్రుమమంజరీమధుఝరీమాధుర్యఖేలద్గిరాం |
మాతంగీం మధురాలసాం కరశుకాం నీలాలకాలంకృతాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికాం || 7 ||
కర్ణాలంబితహేమకుండలయుగాం కాదంబవేణీముమాం
అంభోజాసనవాసవాదివినుతామర్ధేందుభూషోజ్జ్వలాం |
కస్తూరీతిలకాభిరామనిటిలాం గానప్రియాం శ్యామలాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికాం || 8 ||
కౌమారీం నవపల్లవాంఘ్రియుగళాం కర్పూరభాసోజ్జ్వలాం
గంగావర్తసమాననాభికుహరాం గాంగేయభూషాన్వితాం |
చంద్రార్కానలకోటికోటిసదృశాం చంద్రార్కబింబాననాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికాం || 9 ||
బాలాదిత్యనిభాననాం త్రినయనాం బాలేందునా భూషితాం
నీలాకారసుకేశినీ విలసితాం నిత్యాన్నదానప్రదాం |
శంఖం చక్రవరాభయం చ దధతీం సారస్వతార్థప్రదాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికాం || 10 ||
ఇతి శ్రీ జ్ఞానప్రసూనాంబికా స్తోత్రం |
Sri Gnana Prasunambika Stotram pdf download – శ్రీ జ్ఞానప్రసూనాంబికా స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



