Sri Balambika Stotram (Ashtakam) pdf download – శ్రీ బాలాంబికా స్తోత్రం

వేలాతిలంఘ్య కరుణే విబుధేంద్ర వంద్యే
లీలావినిర్మిత చరాచరహృన్నివాసే |
మాలా కిరీట మణికుండల మండితాంగే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || 1 ||
కంజాసనాది మణిమంజుకిరీటకోటి
ప్రత్యుప్తరత్నరుచి రంజిత పాదపద్మే |
మంజీర మంజుల వినిర్జిత హంసనాదే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || 2 ||
ప్రాలేయభాను కలికా కలితాతిరంయే
పాదాగ్రజావలి వినిర్జిత మౌక్తికాభే |
ప్రాణేశ్వరి ప్రథమలోకపతే ప్రజానాం
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || 3 ||
జంఘాదిభిర్విజిత చిత్తజ తూణిభాగే
రంభాది మార్దవ కరీంద్ర కరోరుయుగ్మే |
శంపాశతాధిక సముజ్జ్వల చేలలీలే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || 4 ||
మాణిక్యమౌక్తిక వినిర్మిత మేఖలాఢ్యే
మాయా విలగ్న విలసన్మణిపట్టబంధే |
లోలంబరాజి విలసన్నవరోమజాలే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || 5 ||
న్యగ్రోధపల్లవ తలోదర నింననాభే
నిర్ధూతహార విలసత్కుచ చక్రవాకే |
నిష్కాది మంజుమణిభూషణ భూషితాంగే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || 6 ||
కందర్ప చాప మదభంగ కృతాతిరంయే
భ్రూవల్లరీ వివిధ చేష్టిత రంయమానే |
కందర్పసోదర సమాకృతి ఫాలదేశే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || 7 ||
ముక్తావలీ విలసదూర్మిత కంబుకంఠే
మందస్మితానన వినిర్మిత చంద్రబింబే |
భక్తేష్టదాన నిరతామృత పూర్ణదృష్టే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || 8 ||
కర్ణావలంబి మణికుండల గండభాగే
కర్ణాంతదీర్ఘ నవనీరజపత్ర నేత్రే |
స్వర్ణాయకాది గుణమౌక్తిక శోభినాసే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || 9 ||
లోలంబరాజి లలితాలకజాలశోభే
మల్లీ నవీన కలికా నవ కుందజాలే |
భాలేందు మంజుల కిరీట విరాజమానే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || 10 ||
బాలాంబికే మహారాజ్ఞి వైద్యనాథప్రియేశ్వరి |
పాహి మామంబ కృపయా త్వత్పాదం శరణం గతః || 11 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment