భజే వ్రజైకమండనం సమస్తపాపఖండనం
స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనం |
సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం
అనంగరంగసాగరం నమామి కృష్ణనాగరం || 1 ||
మనోజగర్వమోచనం విశాలలోలలోచనం
విధూతగోపశోచనం నమామి పద్మలోచనం |
కరారవిందభూధరం స్మితావలోకసుందరం
మహేంద్రమానదారణం నమామి కృష్ణవారణం || 2 ||
కదంబసూనకుండలం సుచారుగండమండలం
వ్రజాంగనైకవల్లభం నమామి కృష్ణదుర్లభం |
యశోదయా సమోదయా సగోపయా సనందయా
యుతం సుఖైకదాయకం నమామి గోపనాయకం || 3 ||
సదైవ పాదపంకజం మదీయ మానసే నిజం
దధానముక్తమాలకం నమామి నందబాలకం |
సమస్తదోషశోషణం సమస్తలోకపోషణం
సమస్తగోపమానసం నమామి నందలాలసం || 4 ||
భువో భరావతారకం భవాబ్ధికర్ణధారకం
యశోమతీకిశోరకం నమామి చిత్తచోరకం |
దృగంతకాంతభంగినం సదా సదాలసంగినం
దినే దినే నవం నవం నమామి నందసంభవం || 5 ||
గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం
సురద్విషన్నికందనం నమామి గోపనందనం |
నవీనగోపనాగరం నవీనకేలిలంపటం
నమామి మేఘసుందరం తడిత్ప్రభాలసత్పటం || 6 ||
సమస్తగోపనందనం హృదంబుజైకమోదనం
నమామి కుంజమధ్యగం ప్రసన్నభానుశోభనం |
నికామకామదాయకం దృగంతచారుసాయకం
రసాలవేణుగాయకం నమామి కుంజనాయకం || 7 ||
విదగ్ధగోపికామనోమనోజ్ఞతల్పశాయినం
నమామి కుంజకాననే ప్రవృద్ధవహ్నిపాయినం |
కిశోరకాంతిరంజితం దృగంజనం సుశోభితం
గజేంద్రమోక్షకారిణం నమామి శ్రీవిహారిణం || 8 ||
యదా తదా యథా తథా తథైవ కృష్ణసత్కథా
మయా సదైవ గీయతాం తథా కృపా విధీయతాం |
ప్రమాణికాష్టకద్వయం జపత్యధీత్య యః పుమాన్
భవేత్ స నందనందనే భవే భవే సుభక్తిమాన్ || 9 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృతం శ్రీ కృష్ణాష్టకం ||
Sri Krishna Ashtakam 4 (Bhaje Vrajaika Mandanam) pdf download – శ్రీ కృష్ణాష్టకం 4
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



