Endurance meaning in Telugu – ఎన్డ్యూరెన్స్ అర్థం తెలుగులో

✅ Fact Checked

Endurance meaning in Telugu – ఎన్డ్యూరెన్స్ అర్థం తెలుగులో: ఎన్డ్యూరెన్స్ అనే పదాన్ని సాధారణంగా శారీరక శ్రమ అధికంగా ఉండే పనులు, ఎక్సర్సైజులు, మరియు క్రీడల విషయంలో ఉపయోగిస్తారు. సాధారణంగా ఎన్డ్యూరెన్స్ అంటే ఓర్పు, తాళిమి, ఓపిక, సహనం వంటి అర్ధాలు వస్తాయి. ఈ పదం యొక్క అర్ధాలు, ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలి, మరియు ఉదాహరణలు ఈ పోస్టులో తెలియజేస్తున్నాము.

Endurance meaning in Telugu – ఎన్డ్యూరెన్స్ అంటే తెలుగులో అర్ధం ఏమిటి?

ఎన్డ్యూరెన్స్ అంటే కఠినమైన పరీక్షలు, సవాళ్లు, మరియు పోటీని ఎక్కువ కాలం తట్టుకుని నిలబడగలిగే లక్షణం. మనిషికి ఏదైనా దెబ్బ తగిలితే అది మానటానికి కొంత సమయం పడుతుంది. అప్పటివరకు ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా మరియు గాయం పెద్దది కాకుండా జాగ్రత్త పడాలి. అందుకే మనిషి శరీరం ఏదైనా నొప్పి లేదా బాధ కలిగినప్పుడు వెంటనే రిలాక్స్ అవ్వటానికి ప్రయత్నిస్తుంది. ఏదైనా శారీరక లేదా మానసిక సమస్యలు మరియు ఒత్తిళ్లు ఎదురైనప్పుడు వాటి నుండి దూరంగా వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవాలనిపించటానికి కారణం ఇదే. కానీ అన్ని సందర్భాలలో అలా దూరంగా పారిపోవటం వల్ల పరిష్కారం దొరకదు. కొన్ని సార్లు ఆ నొప్పి, బాధలను భరిస్తూ ముందుకు సాగితే శరీరం వాటికి అలవాటుపడి ధృడంగా తయారవుతుంది. అందుకే ఎన్డ్యూరెన్స్ అనేది వ్యాయామం మరియు క్రీడలలో తప్పనిసరిగా ఉండవలసిన లక్షణం.

Also Read  Introvert meaning in Telugu - ఇంట్రావర్ట్ అర్ధం తెలుగులో

ఎన్డ్యూరెన్స్ (Endurance) = ఓర్పు, తాళిమి, ఓపిక, సహనం, కఠినమైన పరీక్షలను తట్టుకునే సామర్ధ్యం

సహజంగా కొంత మందికి శారీరక మానసిక దృఢత్వం ఉంటుంది. మిగిలిన వాళ్ళు ప్రాక్టీస్ తో దాన్ని సాధించవచ్చు. కష్టతరమైన పరిస్థితుల్లో ఎక్కువ కాలం తట్టుకుని నిలబడితే దాన్ని ఎన్డ్యూరెన్స్ అంటారు. ఈ పదాన్ని వాక్యాల్లో ఎలా ఉపయోగించాలో తెలియాలంటే క్రింద ఉన్న ఉదాహరణలు చుడండి.

Endurance Test meaning in Telugu – ఎన్డ్యూరెన్స్ టెస్ట్ అంటే తెలుగులో అర్ధం ఏమిటి?

ఎన్డ్యూరెన్స్ టెస్ట్ అంటే ఓర్పు మరియు సహనాన్ని పరీక్షించటం అనే అర్ధం వస్తుంది. క్రీడాకారులు మరియు వ్యాయామం చేసేవాళ్ళు ఎంత సేపు నొప్పి బాధను తట్టుకుని ఉండగలరు అని తెలుసుకోవటానికి ఎన్డ్యూరెన్స్ టెస్ట్ చేస్తారు. ఎంత త్వరగా అలసిపోతారు అని కూడా ఈ టెస్ట్ వల్ల తెలుస్తుంది.

ఎన్డ్యూరెన్స్ టెస్ట్ (Endurance Test) = ఓర్పు మరియు సహనాన్ని పరీక్షించటం

Endurance meaning in Gym – జిమ్ లో ఎన్డ్యూరెన్స్ అంటే అర్ధం ఏమిటి?

సాధారణంగా జిమ్ లో ఎంతసేపు వ్యాయామం చేయగలరో ఆ సామర్ధ్యాన్ని ఎన్డ్యూరెన్స్ అంటారు. కొత్తగా జిమ్ కి వచ్చినవారు కొంతసేపటికే అలసిపోతారు. కాలక్రమేణా ఎక్కువసేపు వ్యాయామం చేయగలుగుతారు. శారీరక దృఢత్వం మరియు విల్ పవర్ రెండు పెరుగుతాయి.

జిమ్ లో ఎన్డ్యూరెన్స్ (Endurance meaning in Gym) = ఎక్కువసేపు వ్యాయామం చేయగలిగే సామర్ధ్యం

Endurance related words – ఎన్డ్యూరెన్స్ కి సంబందించిన మరికొన్ని పదాలు

ఎన్డ్యూరెన్స్ కి సంబంధించిన మరికొన్ని పదాలు క్రింద చూడవచ్చు.

Also Read  Obsessed meaning in Telugu – అబ్సెస్డ్ అర్ధం తెలుగులో

Initiative meaning in Telugu = చొరవ, అంకురార్పణ, మొదటి అడుగు

Persistence meaning in Telugu = పట్టుదల

Immense meaning in Telugu = అపారమైన, విస్తారమైన, చాలా పెద్ద

Endeavour meaning in Telugu = కృషి, ప్రయత్నం

Integrity meaning in Telugu = సమగ్రత, నిజాయితీ, పరిపూర్ణత

ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment