శబరిగిరినివాసం శాంతహృత్పద్మహంసం
శశిరుచిమృదుహాసం శ్యామలాంబోధభాసం |
కలితరిపునిరాసం కాంతముత్తుంగనాసం
నతినుతిపరదాసం నౌమి పింఛావతంసం || 1 ||
శబరిగిరినిశాంతం శంఖకుందేందుదంతం
శమధనహృదిభాంతం శత్రుపాలీకృతాంతం |
సరసిజరిపుకాంతం సానుకంపేక్షణాంతం
కృతనుతవిపదంతం కీర్తయేఽహం నితాంతం || 2 ||
శబరిగిరికలాపం శాస్త్రవద్ధ్వాంతదీపం
శమితసుజనతాపం శాంతిహానైర్దురాపం |
కరధృతసుమచాపం కారణోపాత్తరూపం
కచకలితకలాపం కామయే పుష్కలాభం || 3 ||
శబరిగిరినికేతం శంకరోపేంద్రపోతం
శకలితదితిజాతం శత్రుజీమూతపాతం |
పదనతపురహూతం పాలితాశేషభూతం
భవజలనిధిపోతం భావయే నిత్యభూతం || 4 ||
శబరివిహృతిలోలం శ్యామలోదారచేలం
శతమఖరిపుకాలం సర్వవైకుంఠబాలం |
నతజనసురజాలం నాకిలోకానుకూలం
నవమయమణిమాలం నౌమి నిఃశేషమూలం || 5 ||
శబరిగిరికుటీరం శత్రుసంఘాతఘోరం
శఠగిరిశతధారం శష్పితేంద్రారిశూరం |
హరిగిరీశకుమారం హారికేయూరహారం
నవజలదశరీరం నౌమి విశ్వైకవీరం || 6 ||
సరసిజదళనేత్రం సారసారాతివక్త్రం
సజలజలదగాత్రం సాంద్రకారుణ్యపాత్రం |
సహతనయకళత్రం సాంబగోవిందపుత్రం
సకలవిబుధమిత్రం సన్నమామః పవిత్రం || 7 ||
Sri Sabarigirivasa Stotram pdf download – శ్రీ శబరిగిరివాస స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



