Sri Narasimha Ashtakam 2 pdf download – శ్రీ నృసింహాష్టకం 2

✅ Fact Checked

ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మవేదాంతగోచరం |
భవాబ్ధితరణోపాయం శంఖచక్రధరం పదం ||
నీళాం రమాం చ పరిభూయ కృపారసేన
స్తంభే స్వశక్తిమనఘాం వినిధాయ దేవీం |
ప్రహ్లాదరక్షణవిధాయవతీ కృపా తే
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తం || 1 ||
ఇంద్రాదిదేవనికరస్య కిరీటకోటి-
-ప్రత్యుప్తరత్నప్రతిబింబితపాదపద్మ |
కల్పాంతకాలఘనగర్జనతుల్యనాద
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తం || 2 ||
ప్రహ్లాద ఈడ్య ప్రళయార్కసమానవక్త్ర
హుంకారనిర్జితనిశాచరబృందనాథ |
శ్రీనారదాదిమునిసంఘసుగీయమాన
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తం || 3 ||
రాత్రించరాద్రిజఠరాత్పరిస్రంస్యమాన
రక్తం నిపీయ పరికల్పితసాంత్రమాల |
విద్రావితాఽఖిలసురోగ్రనృసింహరూప
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తం || 4 ||
యోగీంద్ర యోగపరిరక్షక దేవదేవ
దీనార్తిహారి విభవాగమ గీయమాన |
మాం వీక్ష్య దీనమశరణ్యమగణ్యశీల
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తం || 5 ||
ప్రహ్లాదశోకవినివారణ భద్రసింహ
నక్తంచరేంద్ర మదఖండన వీరసింహ |
ఇంద్రాదిదేవజనసన్నుతపాదపద్మ
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తం || 6 ||
తాపత్రయాబ్ధిపరిశోషణబాడబాగ్నే
తారాధిపప్రతినిభానన దానవారే |
శ్రీరాజరాజవరదాఖిలలోకనాథ
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తం || 7 ||
జ్ఞానేన కేచిదవలంబ్య పదాంబుజం తే
కేచిత్ సుకర్మనికరేణ పరే చ భక్త్యా |
ముక్తిం గతాః ఖలు జనా కృపయా మురారే
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తం || 8 ||
నమస్తే నారసింహాయ నమస్తే మధువైరిణే |
నమస్తే పద్మనేత్రాయ నమస్తే దుఃఖహారిణే ||


Also Read  Sri Narasimha Stotram 4 (Brahma Krutam) pdf download – శ్రీ నృసింహ స్తోత్రం –4 (బ్రహ్మ కృతం)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment