Sri Nandakumara Ashtakam pdf download – శ్రీ నందకుమారాష్టకం

సుందరగోపాలం ఉరవనమాలం నయనవిశాలం దుఃఖహరం
వృందావనచంద్రం ఆనందకందం పరమానందం ధరణిధరం |
వల్లభఘనశ్యామం పూర్ణకామం ఆత్యభిరామం ప్రీతికరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం || 1 ||
సుందరవారిజవదనం నిర్జితమదనం ఆనందసదనం ముకుటధరం
గుంజాకృతిహారం విపినవిహారం పరమోదారం చీరహరం |
వల్లభపటపీతం కృతముపవీతం కరనవనీతం విబుధవరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం || 2 ||
శోభితముఖధూలం యమునాకూలం నిపట అతూలం సుఖదతరం
ముఖమండితరేణుం చారితధేనుం వాదితవేణుం మధురసురం |
వల్లభమతివిమలం శుభపదకమలం నఖరుచి అమలం తిమిరహరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం || 3 ||
శిరముకుటసుదేశం కుంచితకేశం నటవరవేషం కామవరం
మాయాకృతమనుజం హలధర అనుజం ప్రతిహతదనుజం భారహరం |
వల్లభవ్రజపాలం సుభగసుచాలం హితమనుకాలం భావవరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం || 4 ||
ఇందీవరభాసం ప్రకటసరాసం కుసుమవికాసం వంశధరం
జితమన్మథమానం రూపనిధానం కృతకలగానం చిత్తహరం |
వల్లభమృదుహాసం కుంజనివాసం వివిధవిలాసం కేళికరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం || 5 ||
అతిపరమప్రవీణం పాలితదీనం భక్తాధీనం కర్మకరం
మోహనమతిధీరం ఫణిబలవీరం హతపరవీరం తరళతరం |
వల్లభవ్రజరమణం వారిజవదనం హలధరశమనం శైలధరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం || 6 ||
జలధరద్యుతి అంగం లలితత్రిభంగం బహుకృతిరంగం రసికవరం
గోకులపరివారం మదనాకారం కుంజవిహారం గూఢతరం |
వల్లభవ్రజచంద్రం సుభగసుఛందం కృత ఆనందం భ్రాంతిహరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం || 7 ||
వందితయుగచరణం పావనకరణం జగదుద్ధరణం విమలధరం
కాళియశిరగమనం కృతఫణినమనం ఘాతితయమనం మృదులతరం |
వల్లభదుఃఖహరణం నిర్మలచరణం అశరణశరణం ముక్తికరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం || 8 ||
ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం శ్రీ నందకుమారాష్టకం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment