Sri Batuka Bhairava Stavaraja (Ashtottara Shatanama Stotram cha) pdf download – శ్రీ బటుకభైరవ స్తవరాజః (అష్టోత్తరశతనామ స్తోత్రం చ)

రుద్రయామల తంత్రం నుండి ఉద్భవించిన బటుక భైరవ స్తవరాజ అష్టోత్తరశతనామ స్తోత్రం బటుక భైరవుని స్తుతిస్తూ 108 పేర్లతో కూడిన స్తోత్రం. దీనిని పూజలలో పువ్వులను సమర్పించేటప్పుడు బటుక భైరవుని ప్రీతి కొరకు ఉపయోగిస్తారు.

కైలాసశిఖరాసీనం దేవదేవం జగద్గురుం |
శంకరం పరిపప్రచ్ఛ పార్వతీ పరమేశ్వరం || 1 ||

శ్రీపార్వత్యువాచ |
భగవన్ సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రాగమాదిషు |
ఆపదుద్ధారణం మంత్రం సర్వసిద్ధిప్రదం నృణాం || 2 ||

సర్వేషాం చైవ భూతానాం హితార్థం వాంఛితం మయా |
విశేషతస్తు రాజ్ఞాం వై శాంతిపుష్టిప్రసాధనం || 3 ||

అంగన్యాస కరన్యాస బీజన్యాస సమన్వితం |
వక్తుమర్హసి దేవేశ మమ హర్షవివర్ధనం || 4 ||

శ్రీభగవానువాచ |
శృణు దేవి మహామంత్రమాపదుద్ధారహేతుకం |
సర్వదుఃఖప్రశమనం సర్వశత్రునిబర్హణం || 5 ||

అపస్మారాదిరోగాణాం జ్వరాదీనాం విశేషతః |
నాశనం స్మృతిమాత్రేణ మంత్రరాజమిమం ప్రియే || 6 ||

గ్రహరాజభయానాం చ నాశనం సుఖవర్ధనం |
స్నేహాద్వక్ష్యామి తే మంత్రం సర్వసారమిమం ప్రియే || 7 ||

సర్వకామార్థదం మంత్రం రాజ్యభోగప్రదం నృణాం |
ప్రణవం పూర్వముచ్చార్య దేవీ ప్రణవముద్ధరేత్ || 8 ||

బటుకాయేతి వై పశ్చాదాపదుద్ధారణాయ చ |
కురు ద్వయం తతః పశ్చాద్బటుకాయ పునః క్షిపేత్ || 9 ||

దేవీ ప్రణవముద్ధృత్య మంత్రరాజమిమం ప్రియే |
మంత్రోద్ధారమిమం దేవి త్రైలోక్యస్యాపి దుర్లభం || 10 ||

అప్రకాశ్యమిమం మంత్రం సర్వశక్తిసమన్వితం |
స్మరణాదేవ మంత్రస్య భూతప్రేతపిశాచకాః || 11 ||

విద్రవంతి భయార్తా వై కాలరుద్రాదివ ప్రజాః |
పఠేద్వా పాఠయేద్వాపి పూజయేద్వాపి పుస్తకం || 12 ||

నాగ్నిచౌరభయం వాపి గ్రహరాజభయం తథా |
న చ మారీభయం తస్య సర్వత్ర సుఖవాన్ భవేత్ || 13 ||

ఆయురారోగ్యమైశ్వర్యం పుత్రపౌత్రాదిసంపదః |
భవంతి సతతం తస్య పుస్తకస్యాపి పూజనాత్ || 14 ||

శ్రీపార్వత్యువాచ |
య ఏష భైరవో నామ ఆపదుద్ధారకో మతః |
త్వయా చ కథితో దేవ భైరవః కల్ప ఉత్తమః || 15 ||

తస్య నామసహస్రాణి అయుతాన్యర్బుదాని చ |
సారముద్ధృత్య తేషాం వై నామాష్టశతకం వద || 16 ||

శ్రీభగవానువాచ |
యస్తు సంకీర్తయేదేతత్ సర్వదుష్టనిబర్హణం |
సర్వాన్ కామానవాప్నోతి సాధకః సిద్ధిమేవ చ || 17 ||

శృణు దేవి ప్రవక్ష్యామి భైరవస్య మహాత్మనః |
ఆపదుద్ధారకస్యేహ నామాష్టశతముత్తమం || 18 ||

సర్వపాపహరం పుణ్యం సర్వాపద్వినివారకం |
సర్వకామార్థదం దేవి సాధకానాం సుఖావహం || 19 ||

దేహాంగన్యసనం చైవ పూర్వం కుర్యాత్ సమాహితః |
భైరవం మూర్ధ్ని విన్యస్య లలాటే భీమదర్శనం || 20 ||

అక్ష్ణోర్భూతాశ్రయం న్యస్య వదనే తీక్ష్ణదర్శనం |
క్షేత్రపం కర్ణయోర్మధ్యే క్షేత్రపాలం హృది న్యసేత్ || 21 ||

క్షేత్రాఖ్యం నాభిదేశే చ కట్యాం సర్వాఘనాశనం |
త్రినేత్రమూర్వోర్విన్యస్య జంఘయో రక్తపాణికం || 22 ||

పాదయోర్దేవదేవేశం సర్వాంగే వటుకం న్యసేత్ |
ఏవం న్యాసవిధిం కృత్వా తదనంతరముత్తమం || 23 ||

నామాష్టశతకస్యాపి ఛందోఽనుష్టుబుదాహృతం |
బృహదారణ్యకో నామ ఋషిశ్చ పరికీర్తితః || 24 ||

దేవతా కథితా చేహ సద్భిర్వటుకభైరవః |
ధర్మార్థకామమోక్షేషు వినియోగః ప్రకీర్తితః || 25 ||

(అష్టోత్తరశతనామ స్తోత్రం)
ఓం భైరవో భూతనాథశ్చ భూతాత్మా భూతభావనః |
క్షేత్రదః క్షేత్రపాలశ్చ క్షేత్రజ్ఞః క్షత్రియో విరాట్ || 26 ||

శ్మశానవాసీ మాంసాశీ ఖర్పరాశీ మఖాంతకృత్ |
రక్తపః ప్రాణపః సిద్ధః సిద్ధిదః సిద్ధసేవితః || 27 ||

కరాలః కాలశమనః కలాకాష్ఠాతనుః కవిః |
త్రినేత్రో బహునేత్రశ్చ తథా పింగలలోచనః || 28 ||

శూలపాణిః ఖడ్గపాణిః కంకాలీ ధూంరలోచనః |
అభీరుర్భైరవో భీరుర్భూతపో యోగినీపతిః || 29 ||

ధనదో ధనహారీ చ ధనపః ప్రతిభావవాన్ |
నాగహారో నాగకేశో వ్యోమకేశః కపాలభృత్ || 30 ||

కాలః కపాలమాలీ చ కమనీయః కలానిధిః |
త్రిలోచనో జ్వలన్నేత్రస్త్రిశిఖీ చ త్రిలోకపాత్ || 31 ||

త్రివృత్తనయనో డింభః శాంతః శాంతజనప్రియః |
వటుకో వటుకేశశ్చ ఖట్వాంగవరధారకః || 32 ||

భూతాధ్యక్షః పశుపతిర్భిక్షుకః పరిచారకః |
ధూర్తో దిగంబరః సౌరిర్హరిణః పాండులోచనః || 33 ||

ప్రశాంతః శాంతిదః శుద్ధః శంకరప్రియబాంధవః |
అష్టమూర్తిర్నిధీశశ్చ జ్ఞానచక్షుస్తమోమయః || 34 ||

అష్టాధారః కలాధారః సర్పయుక్తః శశీశిఖః |
భూధరో భూధరాధీశో భూపతిర్భూధరాత్మకః || 35 ||

కంకాలధారీ ముండీ చ వ్యాలయజ్ఞోపవీతవాన్ |
జృంభణో మోహనః స్తంభీ మారణః క్షోభణస్తథా || 36 ||

శుద్ధనీలాంజనప్రఖ్యదేహో ముండవిభూషితః |
బలిభుక్ బలిభూతాత్మా కామీ కామపరాక్రమః || 37 ||

సర్వాపత్తారకో దుర్గో దుష్టభూతనిషేవితః |
కామీ కలానిధిః కాంతః కామినీవశకృద్వశీ |
సర్వసిద్ధిప్రదో వైద్యః ప్రభవిష్ణుః ప్రభావవాన్ || 38 ||

(ఫలశ్రుతిః)
అష్టోత్తరశతం నామ భైరవస్య మహాత్మనః |
మయా తే కథితం దేవి రహస్యం సర్వకామికం || 39 ||

య ఇదం పఠతి స్తోత్రం నామాష్టశతముత్తమం |
న తస్య దురితం కించన్న రోగేభ్యో భయం తథా |
న శత్రుభ్యో భయం కించిత్ ప్రాప్నోతి మానవః క్వచిత్ || 40 ||

పాతకానాం భయం నైవ పఠేత్ స్తోత్రమనన్యధీః |
మారీభయే రాజభయే తథా చౌరాగ్నిజే భయే || 41 ||

ఔత్పాతికే మహాఘోరే యథా దుఃస్వప్నదర్శనే |
బంధనే చ తథా ఘోరే పఠేత్ స్తోత్రం సమాహితః || 42 ||

సర్వే ప్రశమనం యాంతి భయాద్భైరవకీర్తనాత్ |
ఏకాదశసహస్రం తు పురశ్చరణముచ్యతే || 43 ||

త్రిసంధ్యం యః పఠేద్దేవి సంవత్సరమతంద్రితః |
స సిద్ధిం ప్రాప్నుయాదిష్టాం దుర్లభమపి మానుషః || 44 ||

షణ్మాసాన్ భూమికామస్తు స జప్త్వా లభతే మహీం |
రాజా శత్రువినాశాయ జపేన్మాసాష్టకం పునః || 45 ||

రాత్రౌ వారత్రయం చైవ నాశయత్యేవ శాత్రవాన్ |
జపేన్మాసత్రయం రాత్రౌ రాజానం వశమానయేత్ || 46 ||

ధనార్థీ చ సుతార్థీ చ దారార్థీ యస్తు మానవః |
పఠేద్వారత్రయం యద్వా వారమేకం తథా నిశి || 47 ||

ధనం పుత్రాంస్తథా దారాన్ ప్రాప్నుయాన్నాత్ర సంశయః |
రోగీ రోగాత్ ప్రముచ్యేత బద్ధో ముచ్యేత బంధనాత్ || 48 ||

భీతో భయాత్ ప్రముచ్యేత దేవి సత్యం న సంశయః |
యాన్ యాన్ సమీ హతే కామాంస్తాంస్తానాప్నోతి నిశ్చితం |
అప్రకాశ్యమిదం గుహ్యం న దేయం యస్య కస్యచిత్ || 49 ||

సత్కులీనాయ శాంతాయ ఋజవే దంభవర్జితే |
దద్యాత్ స్తోత్రమిదం పుణ్యం సర్వకామఫలప్రదం |
ధ్యానం వక్ష్యామి దేవస్య యథా ధ్యాత్వా పఠేన్నరః || 50 ||

ఓం శుద్ధస్ఫటికసంకాశం సహస్రాదిత్యవర్చసం |
అష్టబాహుం త్రినయనం చతుర్బాహుం ద్విబాహుకం || 51 ||

భుజంగమేఖలం దేవమగ్నివర్ణశిరోరుహం |
దిగంబరం కుమారీశం వటుకాఖ్యం మహాబలం || 52 ||

ఖట్వాంగమసిపాశం చ శూలం చైవ తథా పునః |
డమరుం చ కపాలం చ వరదం భుజగం తథా || 53 ||

నీలజీమూతసంకాశం నీలాంజనచయప్రభం |
దంష్ట్రాకరాలవదనం నూపురాంగదభూషితం || 54 ||

ఆత్మవర్ణసమోపేతసారమేయసమన్వితం |
ధ్యాత్వా జపేత్ సుసంహృష్టః సర్వాన్ కామానవాప్నుయాత్ || 55 ||

ఏతచ్ఛ్రుత్వా తతో దేవీ నామాష్టశతముత్తమం |
భైరవాయ ప్రహృష్టాభూత్ స్వయం చైవ మహేశ్వరీ || 56 ||

ఇతి విశ్వసారోద్ధారతంత్రే ఆపదుద్ధారకల్పే భైరవ స్తవరాజః సమాప్తః ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment