లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశం |
గోక్షీరసార ఘనసారపటీరవర్ణం
వందే కృపానిధిమహోబలనారసింహం || 1 ||
ఆద్యంతశూన్యమజమవ్యయమప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచనమాదిదేవం |
అబ్జాముఖాబ్జమదలోలుపమత్తభృంగం
వందే కృపానిధిమహోబలనారసింహం || 2 ||
కోటీరకోటిఘటితోజ్జ్వలకాంతికాంతం
కేయూరహారమణికుండలమండితాంగం |
చూడాగ్రరంజితసుధాకరపూర్ణబింబం
వందే కృపానిధిమహోబలనారసింహం || 3 ||
వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విబుధేంద్రవంద్యం |
హంసాత్మకం పరమహంసమనోవిహారం
వందే కృపానిధిమహోబలనారసింహం || 4 ||
మందాకినీజననహేతుపదారవిందం
బృందారకాలయవినోదనముజ్జ్వలాంగం |
మందారపుష్పతులసీరచితాంఘ్రిపద్మం
వందే కృపానిధిమహోబలనారసింహం || 5 ||
తారుణ్యకృష్ణతులసీదళధామరంయం
ధాత్రీరమాభిరమణం మహనీయరూపం |
మంత్రాధిరాజమథదానవమానభృంగం
వందే కృపానిధిమహోబలనారసింహం || 6 ||
Sri Ahobala Narasimha Stotram pdf download – శ్రీ అహోబల నృసింహ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



