ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర
వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః || 1 ||
నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే
దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః || 2 ||
మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితం
మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః || 3 ||
నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే
నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః || 4 ||
రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకం
కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః || 5 ||
యజ్ఞాయ యజ్ఞగంయాయ యజ్ఞరక్షాకరాయ చ
యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః || 6 ||
ణాకారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదం
నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః || 7 ||
యజ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయ తే నమః
సుజ్ఞానగోచరాయాఽస్తు యకారాయ నమో నమః || 8 ||
ఇతి శ్రీ నారాయణ అష్టాక్షరీ స్తుతిః |
Narayana ashtakshari stuti in telugu pdf download – శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



