Harivarasanam (Harihara Atmaja Ashtakam) pdf download – శ్రీ హరిహరాత్మజాష్టకం (హరివరాసనం)

హరివరాసనం విశ్వమోహనం
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం |
అరివిమర్దనం నిత్యనర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే || 1 ||
శరణకీర్తనం శక్తమానసం
భరణలోలుపం నర్తనాలసం |
అరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే || 2 ||
ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణతకల్పకం సుప్రభాంచితం |
ప్రణవమందిరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే || 3 ||
తురగవాహనం సుందరాననం
వరగదాయుధం వేదవర్ణితం |
గురుకృపాకరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే || 4 ||
త్రిభువనార్చితం దేవతాత్మకం
త్రినయనప్రభుం దివ్యదేశికం |
త్రిదశపూజితం చింతితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే || 5 ||
భవభయాపహం భావుకావహం
భువనమోహనం భూతిభూషణం |
ధవళవాహనం దివ్యవారణం
హరిహరాత్మజం దేవమాశ్రయే || 6 ||
కలమృదుస్మితం సుందరాననం
కలభకోమలం గాత్రమోహనం |
కలభకేసరీ-వాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే || 7 ||
శ్రితజనప్రియం చింతితప్రదం
శ్రుతివిభూషణం సాధుజీవనం |
శ్రుతిమనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయే || 8 ||
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా |
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా |
|| ఇతి శ్రీ హరిహరాత్మజాష్టకం సంపూర్ణం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment