Hakuna Matata meaning in Telugu – హకునా మటాట అర్ధం తెలుగులో

✅ Fact Checked

Hakuna Matata meaning in Telugu – హకునా మటాట అర్ధం తెలుగులో: హకునా మటాట అనే పదం ఇంగ్లీష్ భాషకు చెందినది కాదు. కానీ, సినిమాల ద్వారా ప్రాచుర్యం పొందింది. హకునా మటాట అనేది ఆఫ్రికా ఖండంలో స్వాహిలి భాషకు చెందిన ఊతపదం (Swahili phrase). స్వాహిలిలో Hakuna అంటే No (నో), Matata అంటే worries, problems అని అర్థం. హకునా మటాట (Hakuna Matata) అంటే ఏం పరవాలేదు, ఇబ్బందేమీ లేదు, సమస్యేమీ లేదు అనే అర్ధాలు వస్తాయి. తూర్పు ఆఫ్రికాలో ప్రారంభమైన స్వాహిలి భాష ప్రస్తుతం 14 దేశాల్లో విస్తరించింది. ప్రధానంగా టాంజానియా (Tanzania) లో ఎక్కువమంది స్వాహిలి భాష మాట్లాడతారు.

Hakuna Matata meaning in Telugu – హకునా మటాట అర్ధం తెలుగులో

హకునా మటాట అనే పదాన్ని సాధారణంగా “ఇబ్బందేమీ లేదు” మరియు “ఏం పరవాలేదు” అనే అర్ధాలు వచ్చేలా ఉపయోగిస్తారు. చిన్న పిల్లలు సైకిల్ తొక్కుతూ కిందపడితే పెద్దలు కంగారుపడకుండా ఏం పరవాలేదు అని చెప్పటానికి ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. అలాగే విద్యార్థులు పరీక్ష కష్టంగా ఉన్నప్పుడు ఇబ్బందేమీ లేదు అని చెప్పటానికి ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. ఏదైనా సమస్యని తట్టుకుని నిలబడగలమని చెప్పటానికి కూడా హకునా మటాట అనే పదాన్ని ఉపయోగించవచ్చు.

Also Read  Introvert meaning in Telugu - ఇంట్రావర్ట్ అర్ధం తెలుగులో

హకునా మటాట (Hakuna Matata) = ఇబ్బందేమీ లేదు, ఏం పరవాలేదు, సమస్యేమీ లేదు

Hakuna Matata song from “The Lion King” movie – “ది లయన్ కింగ్” చిత్రం లోని హకునా మటాట పాట

వాల్ట్ డిస్నీ పిక్చర్స్ 1994 లో తీసిన “ది లయన్ కింగ్” అనే యానిమేషన్ చిత్రంలో హకునా మటాట అనే పాట బాగా ప్రాచుర్యం పొందింది. ఆ చిత్రంలోని కొన్ని పాత్రలు ఈ పదాన్ని ఊతపదంలా ఉపయోగిస్తాయి. ఈ చిత్రం అసాధారణ విజయం సాధించటంతో ఈ పదం ప్రపంచమంతా విస్తరించింది. 2019లో ఈ చిత్రం లైవ్ యాక్షన్ రీమేక్ తో ఈ పదం మరొక్కసారి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. చాలా మంది ఈ పదాన్ని ఊతపదంలా వాడడం మొదలుపెట్టారు.

Hakuna Matata song from “The Lion King” movie. Video credits: Walt Disney Studios

హకునా మటాట ట్రేడ్ మార్క్ వివాదం

హకునా మటాట అనే పదం ప్రాచుర్యం పొందటంతో వాల్ట్ డిస్నీ పిక్చర్స్ సంస్థ ఈ పదానికి అమెరికా లో ట్రేడ్ మార్క్ పొందింది. ఆఫ్రికా దేశాలు ఈ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశాయి. కొన్ని ఆఫ్రికన్ దేశాలు ఈ సంఘటనను తూర్పు ఆఫ్రికాలోని పేద దేశాలపై అమెరికన్ సంస్థ వాల్ట్ డిస్నీ పిక్చర్స్ చేసిన సాంస్కృతిక దాడిగా అభివర్ణించాయి. ఇతర దేశాల్లోని వాడుక పదాలకు ఎలా ట్రేడ్ మార్క్ పొందుతారని చాలామంది విమర్శించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ సంస్థ ఈ పదాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవచ్చు అని చెప్పటంతో ఈ వివాదం సద్దుమణిగింది.

Also Read  Bestie meaning in Telugu - బెస్టీ అర్ధం తెలుగులో

హకునా మటాట భారత దేశంలో కూడా ప్రాచుర్యం పొందింది. కొన్ని వాణిజ్య ప్రకటనలలో కూడా ఈ పదాన్ని వినియోగించారు.

ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment