Chowkidar meaning in Telugu – చౌకీదార్ అర్ధం తెలుగులో: సాధారణంగా ఎక్కువ మంది ఇంగ్లీష్ పదాల అర్ధాలు తెలుసుకోవటానికి గూగుల్ లో వెతుకుతుంటారు. కానీ అరుదుగా కొన్ని హిందీ లేదా ఇతర భాషలకు చెందిన పదాలు ప్రాచుర్యం పొందుతాయి. అటువంటిదే చౌకీదార్ (चौकीदार) అనే హిందీ పదం. ఈ పదం యొక్క అర్ధం, ఎలాంటి సందర్భాలలో ఉపయోగించవచ్చు, మరియు ఈ పదం ఎలా ప్రాచుర్యం పొందిందో ఈ వ్యాసంలో తెలుసుకుందాము.
Chowkidar meaning in Telugu – చౌకీదార్ అర్థం తెలుగులో, చౌకీదార్ మీనింగ్ ఇన్ తెలుగు
చౌకీదార్ (Chowkidar / चौकीदार) = కాపలాదారుడు, సంరక్షకుడు, జవాబుదారితనం కలవాడు అని అర్థం.
హిందీలో చౌకీదార్ అనేది సాధారణంగా ఉపయోగించే పదం. చౌకీదార్ అంటే ఒక ఇల్లు లేదా వాణిజ్య సంస్థను కాపాడటానికి పనిచేసే వ్యక్తి. ఈ పదాన్ని చాలా సందర్భాలలో ఉపయోగిస్తారు. చౌకీదార్ అంటే ఒక ఇంటికి లేదా అపార్టుమెంటుకు వాచ్ మాన్ గా పనిచేసే వ్యక్తి, ఒక ప్రైవేటు స్థలానికి లేదా సంస్థకు కాపలాగా ఉండే సెక్యూరిటీ గార్డులు, హాస్టల్ లో వార్డెన్, పిల్లలను సంరక్షించడానికి నియమించబడిన గార్డియన్, బ్యాంకులలో సెక్యూరిటీగా ఉండే వ్యక్తుల వంటి వాళ్ళు. ఇలా జవాబుదారీతనంతో కాపలా కాసేవాళ్లను చౌకీదార్ అని పిలవచ్చు.
Chowkidar Chor Hai meaning in Telugu – చౌకీదార్ చోర్ హై అర్థం తెలుగులో
చౌకీదార్ చోర్ హై అంటే కాపలాదారుడే దొంగ అని అర్ధం. ఈ వాక్యాన్ని తెలుగులో దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అనే సామెత స్థానంలో ఉపయోగించవచ్చు. ఇది కాకుండా తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం, కంచె చేను మేయటం, కృతజ్ఞత లేకపోవటం, నమ్మకద్రోహం చేయటం అనే అర్ధాలు వచ్చేలా ఈ వాక్యాన్ని సందర్భానుసారం ఉపయోగించవచ్చు.
ఒక సందర్భంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేను పాలకుడను కాదు కేవలం సేవకుడను మాత్రమే అనే అర్ధం వచ్చేలా “మై భీ చౌకీదార్” అన్నారు. దీనికి బదులుగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాపలాదారుడే దొంగ అనే అర్ధం వచ్చేలా “చౌకీదార్ చోర్ హై” అనటంతో ఈ పదాలు మరియు వాక్యాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇదంతా జరిగి చాలా కాలం అయినప్పటికీ కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ఇప్పటికి చౌకీదార్ అనే పదాన్ని వాళ్ళ పేరు చివర లేదా పోస్టులలో ఉపయోగించటం గమనించవచ్చు.
ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.