Sri Parvati Panchakam –1 pdf download – శ్రీ పార్వతీ పంచకం –1

ధరాధరేంద్రనందినీ శశాంకమౌళిసంగినీ
సురేశశక్తివర్ధినీ నితాంతకాంతకామినీ |
నిశాచరేంద్రమర్దినీ త్రిశూలశూలధారిణీ
మనోవ్యథావిదారిణీ శివం తనోతు పార్వతీ || 1 ||
భుజంగతల్పశాయినీ మహోగ్రకాంతభామినీ
ప్రకాశపుంజదామినీ విచిత్రచిత్రకారిణీ |
ప్రచండశత్రుధర్షిణీ దయాప్రవాహవర్షిణీ
సదా సుభాగ్యదాయినీ శివం తనోతు పార్వతీ || 2 ||
ప్రకృష్టసృష్టికారికా ప్రచండనృత్యనర్తికా
పినాకపాణిధారికా గిరీశశృంగమాలికా |
సమస్తభక్తపాలికా పీయూషపూర్ణవర్షికా
కుభాగ్యరేఖమార్జికా శివం తనోతు పార్వతీ || 3 ||
తపశ్చరీ కుమారికా జగత్పరా ప్రహేలికా
విశుద్ధభావసాధికా సుధాసరిత్ప్రవాహికా
ప్రయత్నపక్షపోషికా సదార్తిభావతోషికా
శనిగ్రహాదితర్జికా శివం తనోతు పార్వతీ || 4 ||
శుభంకరీ శివంకరీ విభాకరీ నిశాచరీ
నభశ్చరీ ధరాచరీ సమస్తసృష్టిసంచరీ |
తమోహరీ మనోహరీ మృగాంకమౌలిసుందరీ
సదోగ్రతాపసంచరీ శివం తనోతు పార్వతీ || 5 ||
పార్వతీ పంచకం నిత్యం ధీయతే యా కుమారికా
దుష్కృతం నిఖిలం హత్వా వరం ప్రాప్నోతి సుందరం |
హే గౌరీ శంకరార్ధాంగీ యథా త్వం శంకరప్రియా
తథా మాం కురు కళ్యాణీ కాంత కాంతాం సుదుర్లభాం || 6 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment