శ్రీకరార్చిత సత్యశాశ్వత లోకనిర్మిత నిర్జరా
పాకశాసనపద్మజాది సురాసురార్చిత భాస్కరా |
ఏకమేవ బ్రహ్మమూర్తి పినాకసంస్థిత శంకరా
శోకవర్జిత శంభునామక విశ్వకర్మ జగత్ప్రభో || 1 ||
సర్వనాయక సర్వదాయక సర్వసాక్షి మహేశ్వరా
సర్వరాజిత సర్వపూజిత సర్వకార్య ధురంధరా |
సర్వశిక్షక సర్వభక్షక సర్వరక్షక శ్రీకరా
సర్వసద్గుణ సర్వనామక విశ్వకర్మ జగత్ప్రభో || 2 ||
స్వర్ణరూప సువర్ణలోక సమస్తకాంతి మనోహరా
వర్ణరాజిత వర్ణవర్జిత వర్ణరాజ విధాకరా |
వర్ణవాచక వర్ణసంభవ వర్ణవేదజటాధరా
వర్ణవర్ణాతీత వర్ణన విశ్వకర్మ జగత్ప్రభో || 3 ||
మంత్రవిగ్రహ మంత్రసంగ్రహ మంత్రమాయజ సంహరా
మంత్రచేతన మంత్రనూతన మంత్రసంశయ శేఖరా |
మంత్రరాజిత మంత్రపూజిత వేదవేద్య విశారదా
మంత్రబంధుర మంత్రనామక విశ్వకర్మ జగత్ప్రభో || 4 ||
హారఘోర విదారదూర శ్రమణ నిస్వన మంజులా
ధీరవార్ధి గభీరమాయా మంద్రితాశ్రిత చిత్కళా |
సూరిత్వష్టృ విహారకల్ప విచారకారణ సత్ఫలా
మేరు నిర్మిత మేరునామక విశ్వకర్మ జగత్ప్రభో || 5 ||
విశ్వచారణ విశ్వపూరిత విశ్వధారణ నిశ్చయా
విశ్వభూషణ విశ్వతోరణ విశ్వపోషణ విస్మయా |
విశ్వతారణ విశ్వకారణ విశ్వధారణ లీలయా
విశ్వహారణ విశ్వనామక విశ్వకర్మ జగత్ప్రభో || 6 ||
మంగళాకర మంగళాధర మంగళాసన పంచకా
మంగళస్థిత మంగళప్రద మంగళాంగ విరాజితా |
మంగళాయత భీషదాయక మంగళాకర నామకా
మంగళాయజ తుంగనామక విశ్వకర్మ జగత్ప్రభో || 7 ||
కల్పపావన కల్పజీవన కల్పభావ నమోస్తు తే
కల్పపాలన కల్పఖేలన కల్పజాజ్ఞ నమోస్తు తే |
కల్పనాకృత కల్పసంయుత కల్పకల్ప నమోస్తు తే
కల్పితాండజ కల్పనామక విశ్వకర్మ జగత్ప్రభో || 8 ||
Sri Vishwakarma Ashtakam 3 pdf download – శ్రీ విశ్వకర్మాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



