శ్రీకృష్ణ గోకులాధీశ నందగోపతనూద్భవ |
యశోదాగర్భసంభూత మయి దీనే కృపాం కురు || 1 ||
వ్రజానంద వ్రజావాస వ్రజస్త్రీహృదయస్థిత |
వ్రజలీలాకృతే నిత్యం మయి దీనే కృపాం కురు || 2 ||
శ్రీభాగవతభావార్థరసాత్మన్ రసికాత్మక |
నామలీలావిలాసార్థం మయి దీనే కృపాం కురు || 3 ||
యశోదాహృదయానంద విహితాంగణరింగణ |
అలకావృతవక్త్రాబ్జ మయి దీనే కృపాం కురు || 4 ||
విరహార్తివ్రతస్థాత్మన్ గుణగానశ్రుతిప్రియ |
మహాదైన్యదయోద్భూత మయి దీనే కృపాం కురు || 5 ||
అత్యాసక్తజనాసక్త పరోక్షభజనప్రియ |
పరమానందసందోహ మయి దీనే కృపాం కురు || 6 ||
నిరోధశుద్ధహృదయదయితాగీతమోహిత |
ఆత్యంతికవియోగాత్మన్ మయి దీనే కృపాం కురు || 7 ||
స్వాచార్యహృదయస్థాయిలీలాశతయుత ప్రభో |
సర్వథా శరణం యాతే మయి దీనే కృపాం కురు || 8 ||
ఇతి శ్రీహరిదాస విరచితం దైన్యాష్టకం ||
Dainya Ashtakam pdf download – దైన్యాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



