వరసిద్ధిసుబుద్ధిమనోనిలయం
నిరతప్రతిభాఫలదాన ఘనం
పరమేశ్వర మాన సమోదకరం
ప్రణమామి నిరంతరవిఘ్నహరం || 1 ||
అణిమాం మహిమాం గరిమాం లఘిమాం
ఘనతాప్తి సుకామవరేశవశాన్
నిరతప్రదమక్షయమంగళదం
ప్రణమామి నిరంతరవిఘ్నహరం || 2 ||
జననీజనకాత్మవినోదకరం
జనతాహృదయాంతరతాపహరం
జగదభ్యుదయాకరమీప్సితదం
ప్రణమామి నిరంతరవిఘ్నహరం || 3 ||
వరబాల్యసుఖేలనభాగ్యకరం
స్థిరయౌవనసౌఖ్యవిలాసకరం
ఘనవృద్ధమనోహరశాంతికరం
ప్రణమామి నిరంతరవిఘ్నహరం || 4 ||
నిగమాగమలౌకికశాస్త్రనిధి
ప్రదదానచణం గుణగణ్యమణిం
శతతీర్థవిరాజితమూర్తిధరం
ప్రణమామి నిరంతరవిఘ్నహరం || 5 ||
అనురాగమయం నవరాగయుతం
గుణరాజితనామవిశేషహితం
శుభలాభవరప్రదమక్షయదం
ప్రణమామి నిరంతరవిఘ్నహరం || 6 ||
పృథివీశ సుపూజితపాదయుగం
రథయాన విశేషయశోవిభవం
సకలాగమ పూజితదివ్యగుణం
ప్రణమామి నిరంతరవిఘ్నహరం || 7 ||
గగనోద్భవగాంగసరిత్ప్రభవ
ప్రచురాంబుజపూజితశీర్షతలం
మణిరాజితహైమకిరీటయుతం
ప్రణమామి నిరంతరవిఘ్నహరం || 8 ||
ద్విజరాజదివాకరనేత్రయుతం
కమనీయశుభావహకాంతిహితం
రమణీయ విలాసకథావిదితం
ప్రణమామి నిరంతరవిఘ్నహరం || 9 ||
హృదయాంతరదీపకశక్తిధరం
మధురోదయదీప్తికళారుచిరం
సువిశాలనభోంగణదీప్తికరం
ప్రణమామి నిరంతరవిఘ్నహరం || 10 ||
కవిరాజవిరాజితకావ్యమయం
రవికాంతి విభాసితలోకమయం
భువనైక విలాసితకీర్తిమయం
ప్రణమామి నిరంతరవిఘ్నహరం || 11 ||
శ్రీ మరకత లక్ష్మీగణేశ స్తోత్రం సంపూర్ణం |
Marakatha Sri Lakshmi Ganapathi Stotram pdf download – మరకత శ్రీ లక్ష్మీగణపతి స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



