Vibes meaning in Telugu – వైబ్స్ అర్ధం తెలుగులో

వైబ్స్ (Vibes) అనేే పదాన్ని సాధారణంగా వైబ్రేషన్స్ (Vibrations) అనే పదానికి సంక్షిప్తంగా ఉపయోగిస్తారు. అందుకే చాలామంది వైబ్స్ అర్ధాన్ని ప్రకంపనలు, కంపనం, కదలిక అని అనువదిస్తారు. కానీ వైబ్స్ అంటే అనుభూతి మరియు వాతావరణం అనే అర్ధాలు కూడా వస్తాయి. వైబ్స్ అర్ధం, ఉదాహరణలు, మరియు ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో ఈ “Vibes meaning in Telugu – వైబ్స్ అర్ధం తెలుగులో” అనే పోస్టులో తెలుసుకుందాం.

vibes meaning in telugu

Vibes meaning in Telugu – వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు (వైబ్స్ అర్ధం తెలుగులో)

వైబ్స్ (Vibes) అనేే పదాన్ని ఒక వ్యక్తి లేదా ప్రదేశం యొక్క ప్రస్తుత స్వభావాన్ని తెలియజేసేందుకు వాడతాము. ఒక వ్యక్తి మూడ్ (ఆంతరంగిక భావం) లేదా ఒక ప్రదేశం యొక్క వాతావరణాన్ని వైబ్స్ అని చెప్పవచ్చు. అలాగే ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లేదా పూజ జరుగుతుంటే ఆ వాతావరణాన్ని కూడా వైబ్స్ అనే పదం ఉపయోగించి తెలియజేయవచ్చు. వైబ్స్ అనే పదాన్ని కేవలం మంచి లేదా ఆహ్లాదకరమైన వాతావరణానికే కాకుండా చెడు లేదా భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఉపయోగించవచ్చు.

Vibes meaning in Telugu = ప్రకంపనలు, కంపనం, కదలిక, అనుభూతి, వాతావరణం, అనుభవం, భావం.

Morning vibes meaning in Telugu – మార్నింగ్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు

సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది. పగటి వేళలో గాలిలోకి లేచిన దుమ్ము, ధూళి అంతా నేల మీదకి చేరటంతో గాలి పరిశుభ్రంగా ఉంటుంది. వాహనాల రద్దీ లేకపోవటంతో నిశ్శబ్దంగా ఉంటుంది. ఉదయం వ్యాయామం చేయాలనుకునేవారికి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అందుకే ఏదైనా పని ఉదయం మొదలుపెడితే శుభఫలితాలు ఉంటాయని నమ్ముతారు. Morning vibes అంటే ఉదయం ఉండే నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం అని అర్ధం.

Good vibes meaning in Telugu – గుడ్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు

ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు అంతా మంచి జరుగుతుందనే భావన కలిగినప్పుడు దాన్ని గుడ్ వైబ్స్ అంటారు. ఇలాంటి భావన సాధారణంగా మన చుట్టూ ఉండే వ్యక్తులు, పరిస్థితులు, మరియు వాతావరణం వల్ల కలుగుతుంది. Good vibes అంటే శుభ శకునం అని అర్ధం.

Marriage vibes meaning in Telugu – మ్యారేజ్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు

Marriage vibes అంటే పెళ్లి కళ అని అర్థం. పెళ్ళికూతురు కి, పెళ్ళికొడుకు కి పెళ్లి కళ వచ్చింది అని చెప్పే సందర్భంలో మ్యారేజ్ వైబ్స్ పదాన్ని వాడతారు. Wedding vibes అంటే పెళ్లి వాతావరణం అని అర్థం. ఒక ఇంట్లో పెళ్లి వాతావరణం నెలకొంది అంటే కుటుంబ సభ్యులంతా పండుగ లాగా సంతోషంతో జరుపుకుంటారు.

Temple vibes meaning in Telugu – టెంపుల్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు

దేవాలయాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంటాయి. భక్తులు దైవచింతనలో ఉంటారు. పురోహితులు వేదమంత్రాలు చదువుతూ పూజలు చేస్తుంటారు. Temple vibes అంటే దేవాలయాల్లో ఉండే ఆధ్యాత్మిక వాతావరణం అని అర్ధం.

Festival vibes meaning in Telugu – ఫెస్టివల్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు

పండుగల సమయంలో ఒకరకమైన ఆనందం, హడావిడి, అల్లరి కనిపిస్తుంది. కుటుంబమంతా ఒక చోట చేరి పూజలు, పిండి వంటలు, ఆటలతో సంతోషంగా పండుగలు చేసుకుంటారు. Festival vibes అంటే పండుగ వాతావరణం అని అర్ధం.

Evening vibes meaning in Telugu – ఈవెనింగ్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు

రోజంతా ఎండ, వేడి, కాలుష్యం, కంగారులో పరిగెడుతున్నట్టు అనిపించే కాలం సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా ఆగినట్లు అనిపిస్తుంది. వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. Evening vibes అంటే సాయంత్రం వేళలో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం అని అర్ధం.

Positive vibes meaning in Telugu – పాజిటివ్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు

ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఆరంభ ఫలితాలు, చుట్టూ ఉండే వ్యక్తులు మరియు పరిసరాలు శుభప్రదంగా ఉంటే మనల్ని మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ప్రేరేపిస్తాయి. Positive vibes అంటే శుభప్రదమైన వాతావరణం అని అర్థం.

ఇవి కాకుండా వైబ్స్ అనే పదాన్ని చాలా సందర్భాలలో ఉపయోగిస్తారు. Birthday Vibes అంటే పుట్టిన రోజు నాడు నెలకొనే వాతావరణం అని అర్థం. Bad Vibes అంటే చెడు జ్ఞాపకాలు, చెడు వాతావరణం అని అర్థం.

Leave a Comment