Defect, Weakness, Addiction meaning & difference in Telugu – లోపం, బలహీనత, వ్యసనం అర్ధాలు తెలుగులో: సాధారణంగా మనం డిఫెక్ట్ (defect), వీక్నెస్ (weakness), మరియు అడిక్షన్ (addiction) అనే పదాలను ఒకే అర్ధం వచ్చేలా ఉపయోగిస్తాం. కానీ ఈ పదాలకు స్వల్ప వ్యత్యాసం ఉంది. ఈ పదాలను ఎలాంటి సందర్భాలలో ఉపయోగించవచ్చో ఈ పోస్టులో తెలుసుకుందాం.
Defect meaning in Telugu – డిఫెక్ట్ అర్ధం తెలుగులో
డిఫెక్ట్ అంటే లోపం అని అర్ధం. ఒక వ్యక్తికి లేదా వస్తువుకు ఉండాల్సిన భాగాలు లేదా లక్షణాలలో ఏదైనా తగ్గితే దాన్ని లోపం అంటారు. ఒక వ్యక్తికి ఏదైనా శరీర అవయవం లేకపోయినా, ఏదైనా ఇంద్రియాలు సరిగా పనిచేయకపోయినా, లేదా ఏదైనా వ్యసనం ఉన్నా కూడా లోపంగా పరిగణిస్తారు. ఒక వస్తువులో ఉపరితలం, విడి భాగాలు, వాటి అంతర్గత అమరిక, మరియు పనితీరులో ఏది సంతృప్తికరంగా లేకపోయినా దాన్ని లోపంగా పరిగణించవచ్చు.
డిఫెక్ట్ (defect) = లోపం
Defection meaning in Telugu – ఢిఫెక్షన్ అర్ధం తెలుగులో
ఢిఫెక్షన్ అంటే దేశాన్ని, పార్టీని, లేదా నమ్మిన సిద్ధాంతాన్ని వదిలివెళ్లటం, లేదా ప్రత్యర్థులతో చేతులు కలపటం అని అర్ధం. రాజకీయాలలో డిఫెక్టర్ (defector) అంటే ఒక పార్టీ నుండి వేరే పార్టీలోకి వెళ్లే వ్యక్తి అనే అర్ధం వస్తుంది.
ఢిఫెక్షన్ (defection) = ఫిరాయింపు, పార్టీ ఫిరాయింపు, ధర్మత్యాగం, సైద్ధాంతిక విభేదం
Defective Product meaning in Telugu – ఢిఫెక్టివ్ ప్రోడక్ట్ అర్ధం తెలుగులో
ఢిఫెక్టివ్ ప్రోడక్ట్ (defective product) అంటే ఏదైనా లోపం ఉన్న వస్తువు అని అర్ధం. అది తయారీ లోపం (మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్), సంభాళించుటలో లోపం (హ్యాండ్లింగ్ డిఫెక్ట్), లేదా వాడుక వల్ల లోపం (యూసేజ్ డిఫెక్ట్) అయి ఉండొచ్చు. ఒక వస్తువును కొనే ముందు అందులో ఏదైనా లోపం ఉందా అని తెలుసుకోవటం చాలా అవసరం. ఢిఫెక్టివ్ ప్రోడక్ట్ ను కొన్నట్లయితే మీరు దాన్ని వారెంటీని బట్టి రిపెయిర్ లేదా రీప్లేస్మెంట్ చేయవలసి ఉంటుంది.
ఢిఫెక్టివ్ ప్రోడక్ట్ (defective product) = లోపం ఉన్న వస్తువు
మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ (manufacturing defect) = తయారీ లోపం
the product received is defective meaning in Telugu = అందుకున్న వస్తువు లోపభూయిష్టంగా ఉంది
ఇంగ్లీష్ లో లోపాన్ని డెఫిషియన్సీ (deficiency) అని కూడా అంటారు. ఉదాహరణకు శరీరంలో కాల్షియమ్ తక్కువగా ఉంటే దాన్ని కాల్షియమ్ డెఫిషియన్సీ అంటారు.
Weakness meaning in Telugu – వీక్నెస్ అర్ధం తెలుగులో
వీక్నెస్ అంటే బలహీనత అని అర్ధం. బలహీనతలు సాధారణంగా మనుషులను ఇష్టంలేని పనులు చేసేందుకు ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు మీరు ఎవరైనా హీరో సినిమా మొదటి రోజు చూడకుండా ఉండలేకపోతే అది మీ బలహీనత, అలాగే ఏదైనా ఆహార పదార్థం తినకుండా ఉండలేకపోతే, లేదా ఎవరితోనైనా మాట్లాడకుండా ఉండలేకపోతే వాటిని కూడా బలహీనతలుగా పరిగణించవచ్చు. ఇటువంటి బలహీనతల వల్ల సాధారణంగా నష్టం లేకపోయినా, వాటిని మానెయ్యాల్సిన అవసరం వస్తే మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
వీక్నెస్ (weakness) = బలహీనత
స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ (strength and weakness) = బలం మరియు బలహీనత
Addiction meaning in Telugu – అడిక్షన్ అర్ధం తెలుగులో
అడిక్షన్ అంటే వ్యసనం అని అర్ధం. ఒక పని శారీరక లేదా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నా, సమాజంలో గౌరవానికి భంగం కలిగిస్తున్నా, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నా కూడా చేయకుండా ఉండలేకపోతుంటే దాన్ని వ్యసనం అంటారు. వ్యసనపరులు తాము చేసేది తప్పనే భావన ఉన్న కూడా వాటిని మానలేకపోతారు. కొంతమంది వాళ్ళు చేసే పనులను సమర్ధించుకుంటారు. ధూమపానం మరియు మద్యపానం సాధారణంగా మాట్లాడుకునే వ్యసనాలు. ఇవి కాకుండా డ్రగ్స్, స్మార్ట్ ఫోన్స్, టీవీ వంటి చాలా వ్యసనాలున్నాయి.
అడిక్షన్ (addiction) = వ్యసనం
అడిక్టెడ్ (addicted) = వ్యసనపరుడైన
I Am Addicted meaning in Telugu
ఐ యామ్ అడిక్టెడ్ అంటే నేను వ్యసనపరుడిగా మారాను అని అర్ధం. సందర్భాన్ని బట్టి కొంతమంది దీన్ని అతిశయోక్తి కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఐ యామ్ అడిక్టెడ్ టు క్రికెట్ అంటే నేను క్రికెట్ కు వ్యసనపరుడిగా మారాను అని అర్ధం. కానీ నిజానికి వాళ్ళు కేవలం కాలక్షేపం కోసం క్రికెట్ చూడటం లేదా ఆడటం చేస్తుండవచ్చు. అందువలన ఈ వాక్యాన్ని ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తున్నారు అనేదాన్ని బట్టి అర్ధం మారిపోతుంది.
ఐ యామ్ అడిక్టెడ్ (I am addicted) = నేను వ్యసనపరుడిగా మారాను
అడిక్టెడ్ టు మ్యూజిక్ (addicted to music) = సంగీతాన్ని వ్యసనంగా మార్చుకున్నాను
అడిక్టెడ్ టు వన్ గర్ల్ (addicted in one girl) = ఒక అమ్మాయి వ్యసనంలా మారింది
Fully Addicted meaning in Telugu
ఫుల్లీ అడిక్టెడ్ అంటే పూర్తిగా వ్యసనానికి బానిసయ్యాను అని అర్ధం. ఈ పదాన్ని కూడా ప్రస్తుతం అతిశయోక్తి కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు కొంత మంది ఐ యామ్ ఫుల్లీ అడిక్టెడ్ టు థిస్ సాంగ్ అంటారు. అంటే నేను పూర్తిగా ఈ పాటను వ్యసనంగా మార్చుకున్నాను అని అర్ధం వస్తుంది. వాళ్ళ మాటల్లో సిగరెట్ మద్యం లాంటివి అలవాటు చేసుకున్నోళ్ళు ఎలా మానుకోలేరో అలాగే వీళ్ళు ఈ పాటను వినకుండా ఉండలేకపోతున్నారని అర్ధం. కానీ నిజానికి ఇది ఇష్టం మాత్రమే. కొంతకాలానికి వాళ్ళు ఈ పాట మర్చిపోయి వేరే పాటలు వింటారు.
ఫుల్లీ అడిక్టెడ్ (fully addicted) = పూర్తిగా వ్యసనానికి బానిసయ్యాను
Drug Addiction meaning in Telugu
డ్రగ్ అడిక్షన్ అంటే డ్రగ్స్ తీసుకోవటం వ్యసనంగా మార్చుకోవటం అని అర్ధం. కొంతమంది డ్రగ్స్ కు బానిసలుగా మారి అవి దొరక్కపోతే పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తారు. అలాంటి వారిని డ్రగ్ అడిక్ట్స్ (drug addicts) అంటారు. వీళ్ళు సాధారణ స్థితికి రావాలంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ (rehabilitation centers) లో కొన్నాళ్ళు చికిత్స తీసుకోవాలి. డ్రగ్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఓవర్ డోస్ (overdose) అయ్యి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అందుకే డ్రగ్స్ కు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
డ్రగ్ అడిక్షన్ (drug addiction) = డ్రగ్స్ వ్యసనం
addiction of a person is dangerous than drugs = ఒక వ్యక్తిపై ఉండే వ్యసనం డ్రగ్స్ కంటే ప్రమాదకరం
De-addiction meaning in Telugu
డీ అడిక్షన్ అంటే డ్రగ్స్ మానేయటానికి తీసుకునే చికిత్స. ఒక్కో వ్యక్తికి వ్యసన తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. కొందరికి ఒకేసారి డ్రగ్స్ మానేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది, అలాంటివారికి తక్కువ మోతాదులో డ్రగ్స్ ఇచ్చి నిదానంగా మాన్పించే ప్రయత్నం చేస్తారు. డీ అడిక్షన్ సెంటర్స్ లేదా రీహాబిలిటేషన్ సెంటర్స్ లో కొన్నాళ్ళు చికిత్స తీసుకున్నా కూడా డ్రగ్స్ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుందనే గ్యారంటీ లేదు. ఒకవేళ డ్రగ్స్ పూర్తిగా మానేసినా కూడా ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడకపోవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డ్రగ్స్ కు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
డీ అడిక్షన్ (de-addiction) = డ్రగ్స్ మానేసే ప్రయత్నం
Difference between defect, weakness, and addiction in Telugu – లోపం, బలహీనత, మరియు వ్యసనం మధ్య వ్యత్యాసం
డిఫెక్ట్ (లోపం) అంటే ఒక వ్యక్తి లేదా వస్తువు సాధారణ స్థితిలో లేకపోవటం. వీక్నెస్ (బలహీనత) అంటే అలవాటు వల్ల చేసే ఇష్టం లేని లేదా అర్ధం లేని పనులు. అడిక్షన్ (వ్యసనం) అంటే ఆరోగ్యానికి మరియు గౌరవానికి నష్టం కలిగించే మానుకోలేని చెడు అలవాట్లు. చాలా సందర్భాలలో వీటిని ఒకదాని స్థానంలో మరొకటి ఉపయోగిస్తారు.