నారద ఉవాచ |
ఓం వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినం |
జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజం || 1 ||
వారాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకం |
అవ్యక్తం శాశ్వతం విష్ణుమనంతమజమవ్యయం || 2 ||
నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తిభాజనం |
గోవర్ధనోద్ధరం దేవం భూధరం భువనేశ్వరం || 3 ||
వేత్తారం యజ్ఞపురుషం యజ్ఞేశం యజ్ఞవాహకం |
చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్తమం || 4 ||
వైకుంఠం దుష్టదమనం భూగర్భం పీతవాససం |
త్రివిక్రమం త్రికాలజ్ఞం త్రిమూర్తిం నందికేశ్వరం || 5 ||
రామం రామం హయగ్రీవం భీమం రౌద్రం భవోద్భవం |
శ్రీపతిం శ్రీధరం శ్రీశం మంగళం మంగళాయుధం || 6 ||
దామోదరం దయోపేతం కేశవం కేశిసూదనం |
వరేణ్యం వరదం విష్ణుమానందం వసుదేవజం || 7 ||
హిరణ్యరేతసం దీప్తం పురాణం పురుషోత్తమం |
సకలం నిష్కళం శుద్ధం నిర్గుణం గుణశాశ్వతం || 8 ||
హిరణ్యతనుసంకాశం సూర్యాయుతసమప్రభం |
మేఘశ్యామం చతుర్బాహుం కుశలం కమలేక్షణం || 9 ||
జ్యోతీరూపమరూపం చ స్వరూపం రూపసంస్థితం |
సర్వజ్ఞం సర్వరూపస్థం సర్వేశం సర్వతోముఖం || 10 ||
జ్ఞానం కూటస్థమచలం జ్ఞానదం పరమం ప్రభుం |
యోగీశం యోగనిష్ణాతం యోగినం యోగరూపిణం || 11 ||
ఈశ్వరం సర్వభూతానాం వందే భూతమయం ప్రభుం |
ఇతి నామశతం దివ్యం వైష్ణవం ఖలు పాపహం || 12 ||
వ్యాసేన కథితం పూర్వం సర్వపాపప్రణాశనం |
యః పఠేత్ప్రాతరుత్థాయ స భవేద్వైష్ణవో నరః || 13 ||
సర్వపాపవిశుద్ధాత్మా విష్ణుసాయుజ్యమాప్నుయాత్ |
చాంద్రాయణసహస్రాణి కన్యాదానశతాని చ || 14 ||
గవాం లక్షసహస్రాణి ముక్తిభాగీ భవేన్నరః |
అశ్వమేధాయుతం పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవః || 15 ||
Sri Vishnu Shatanama Stotram pdf download – శ్రీ విష్ణు శతనామస్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



