Sri Vayunandana Ashtakam pdf download – శ్రీ వాయునందనాష్టకం

ఏకవీరం మహారౌద్రం తప్తకాంచనకుండలం |
లంబవాలం స్థూలకాయం వందేఽహం వాయునందనం || 1 ||
మహావీర్యం మహాశౌర్యం మహదుగ్రం మహేశ్వరం |
మహాసురేశనిర్ఘాతం వందేఽహం వాయునందనం || 2 ||
జానకీశోకహరణం వానరం కులదీపకం |
సుబ్రహ్మచారిణం శ్రేష్ఠం వందేఽహం వాయునందనం || 3 ||
దశగ్రీవస్య దర్పఘ్నం శ్రీరామపరిసేవకం |
దశదుర్దశహంతారం వందేఽహం వాయునందనం || 4 ||
లంకానిఃశంకదహనం సీతాసంతోషకారిణం |
సముద్రలంఘనం చైవ వందేఽహం వాయునందనం || 5 ||
బ్రహ్మకోటిసమం దివ్యం రుద్రకోటిసమప్రభం |
వరాతీతం మహామంత్రం వందేఽహం వాయునందనం || 6 ||
శతకోటిసుచంద్రార్కమండలాకృతిలక్షణం |
ఆంజనేయం మహాతేజం వందేఽహం వాయునందనం || 7 ||
శీఘ్రకామం చిరంజీవి సర్వకామఫలప్రదం |
హనుమత్ స్తుతిమంత్రేణ వందేఽహం వాయునందనం || 8 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment