Sri Ganapathi Thalam pdf download – శ్రీ గణపతి తాళం

✅ Fact Checked

వికటోత్కటసుందరదంతిముఖం
భుజగేంద్రసుసర్పగదాభరణం |
గజనీలగజేంద్ర గణాధిపతిం
ప్రణతోఽస్మి వినాయక హస్తిముఖం || 1 ||
సుర సుర గణపతి సుందరకేశం
ఋషి ఋషి గణపతి యజ్ఞసమానం |
భవ భవ గణపతి పద్మశరీరం
జయ జయ గణపతి దివ్యనమస్తే || 2 ||
గజముఖవక్త్రం గిరిజాపుత్రం
గణగుణమిత్రం గణపతిమీశప్రియం || 3 ||
కరధృతపరశుం కంకణపాణిం
కబలితపద్మరుచిం |
సురపతివంద్యం సుందరనృత్తం
సురచితమణిమకుటం || 4 ||
ప్రణమత దేవం ప్రకటిత తాళం
షడ్గిరి తాళమిదం |
తత్తత్ షడ్గిరి తాళమిదం
తత్తత్ షడ్గిరి తాళమిదం || 5 ||
లంబోదరవర కుంజాసురకృత కుంకుమవర్ణధరం |
శ్వేతసశృంగం మోదకహస్తం ప్రీతిసపనసఫలం || 6 ||
నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్
నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్
నానాగణపతి తం తత్తత్ నానాగణపతిదం || 7 ||
ధవళిత జలధరధవళిత చంద్రం
ఫణిమణికిరణవిభూషిత ఖడ్గం |
తనుతనువిషహర శూలకపాలం
హర హర శివ శివ గణపతిమభయం || 8 ||
కటతట విగలితమదజల జలధిత-
గణపతివాద్యమిదం
కటతట విగలితమదజల జలధిత-
గణపతివాద్యమిదం
తత్తత్ గణపతివాద్యమిదం
తత్తత్ గణపతివాద్యమిదం || 9 ||
తత్తదిం నం తరికు తరిజణకు కుకు తద్ది
కుకు తకిట డిండింగు డిగుణ కుకు తద్ది
తత్త ఝం ఝం తరిత
త ఝం ఝం తరిత
తకత ఝం ఝం తరిత
త ఝం ఝం తరిత
తరిదణత దణజణుత జణుదిమిత
కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం తాం || 10 ||
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
శశికలిత శశికలిత మౌలినం శూలినం |
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
విమలశుభకమలజలపాదుకం పాణినం |
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
ప్రమథగణగుణకథితశోభనం శోభితం |
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
పృథులభుజసరసిజ విషాణకం పోషణం |
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
పనసఫలకదలిఫలమోదనం మోదకం |
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
ప్రణతగురు శివతనయ గణపతి తాళనం |
గణపతి తాళనం గణపతి తాళనం || 11 ||

Also Read  Yogaprada Ganesha Stotram pdf download – యోగప్రద గణేశ స్తోత్రం (ముద్గల పురాణే)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment