Sri Dharma Sastha Panchakam pdf download – శ్రీ ధర్మశాస్తా పంచకం

పాదారవిందభక్తలోకపాలనైకలోలుపం
సదారపార్శ్వమాత్మజాదిమోదకం సురాధిపం |
ఉదారమాదినాథభూతనాథమద్భుతాత్మవైభవం
సదా రవీందుకుండలం నమామి భాగ్యసంభవం || 1 ||
కృపాకటాక్షవీక్షణం విభూతివేత్రభూషణం
సుపావనం సనాతనాదిసత్యధర్మపోషణం |
అపారశక్తియుక్తమాత్మలక్షణం సులక్షణం
ప్రభామనోహరం హరీశభాగ్యసంభవం భజే || 2 ||
మృగాసనం వరాసనం శరాసనం మహౌజసం
జగద్ధితం సమస్తభక్తచిత్తరంగసంస్థితం |
నగాధిరాజరాజయోగపీఠమధ్యవర్తినం
మృగాంకశేఖరం హరీశభాగ్యసంభవం భజే || 3 ||
సమస్తలోకచింతితప్రదం సదా సుఖప్రదం
సముత్థితాపదంధకారకృంతనం ప్రభాకరం |
అమర్త్యనృత్తగీతవాద్యలాలసం మదాలసం
నమస్కరోమి భూతనాథమాదిధర్మపాలకం || 4 ||
చరాచరాంతరస్థిత ప్రభామనోహర ప్రభో
సురాసురార్చితాంఘ్రిపాదపద్మ భూతనాయక |
విరాజమానవక్త్ర భక్తమిత్ర వేత్రశోభిత
హరీశభాగ్యజాత సాధుపారిజాత పాహి మాం || 5 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment