శ్రీకంఠార్పితపత్రగండయుగళాం సింహాసనాధ్యాసినీం
లోకానుగ్రహకారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీం |
పాకారిప్రముఖామరార్చితపదాం మత్తేభకుంభస్తనీం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితాం || 1 ||
వింధ్యాద్రీంద్రగృహాంతరే నివసితాం వేదాంతవేద్యానిధిం
మందారద్రుమపుష్పవాసితకుచాం మాయాం మహామాయినీం |
బంధూకప్రసవోజ్జ్వలారుణనిభాం పంచాక్షరీరూపిణీం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితాం || 2 ||
మాద్యచ్ఛుంభనిశుంభమేఘపటలప్రధ్వంసఝంఝానిలాం
కౌమారీం మహిషాఖ్యశుష్కవిటపీధూమోరుదావానలాం |
చక్రాద్యాయుధసంగ్రహోజ్జ్వలకరాం చాముండికాధీశ్వరీం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితాం || 3 ||
దృక్కంజాతవిలాసకల్పితసరోజాతోరుశోభాన్వితాం
నక్షత్రేశ్వరశేఖరప్రియతమాం దేవీం జగన్మోహినీం |
రంజన్మంగళదాయినీం శుభకరీం రాజత్స్వరూపోజ్జ్వలాం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితాం || 4 ||
కేళీమందిరరాజతాచలతలాం సంపూర్ణచంద్రాననాం
యోగీంద్రైర్నుతపాదపంకజయుగాం రత్నాంబరాలంకృతాం |
స్వర్గావాససరోజపత్రనయనాభీష్టప్రదాం నిర్మలాం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితాం || 5 ||
సంసారార్ణవతారకాం భగవతీం దారిద్ర్యవిధ్వంసినీం
సంధ్యాతాండవకేళికాం ప్రియసతీం సద్భక్తకామప్రదాం |
శింజన్నూపురపాదపంకజయుగాం బింబాధరాం శ్యామలాం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితాం || 6 ||
చంచత్కాంచనరత్నచారుకటకాం సర్వం సహావల్లభాం
కాంచీకాంచనఘంటికాఘణఘణాం కంజాతపత్రేక్షణాం |
సారోదారగుణాంచితాం పురహరప్రాణేశ్వరీం శాంభవీం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితాం || 7 ||
బ్రహ్మర్షీశ్వరవంద్యపాదకమలాం పంకేరుహాక్షస్తుతాం
ప్రాలేయాచలవంశపావనకరీం శృంగారభూషానిధిం |
తత్త్వాతీతమహాప్రభాం విజయినీం దాక్షాయిణీం భైరవీం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితాం || 8 ||
భ్రమరాంబా మహాదేవ్యాః అష్టకం సర్వసిద్ధిదం |
శత్రూణాం తు నరాణాం చ ధ్వంసనం తద్వదాంయహం || 9 ||
ఇతి శ్రీదూర్వాసవిరచితం శ్రీభ్రమరాంబికాష్టకం |
Sri Bhramarambika Ashtakam (Sri Kantarpita) pdf download – శ్రీ భ్రమరాంబికాష్టకం (శ్రీకంఠార్పిత)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



