స్ఫటికరజతవర్ణం మౌక్తికామాల్యభూషం
అమృతకలశ విద్యాజ్ఞాన ముద్రాః కరాగ్రైః |
దధతమృషభకక్ష్యం చంద్రచూడం త్రినేత్రం
విధృతవివిధభూషం దక్షిణామూర్తిమీడే || 1 ||
ఐంకారైక సమస్తశత్రురచనామావేద్య మూర్తిప్రదాం
ఐశ్వర్యాదికమష్టభోగఫలదాం ఐశ్వర్యదాం పుష్పిణీం |
ఐంద్రవ్యాకరణాది శాస్త్రవరదాం ఐరావతారాధితాం
ఐశానీం భువనత్రయస్య జననీమైంకారిణీమాశ్రయే || 2 ||
క్లీంకారైకసమస్తవశ్యకరిణీం క్లీం పంచబాణాత్మికాం
క్లీం విద్రావణకారిణీం వరశివాం క్లిన్నాం శివాలింగితాం |
క్లీబోఽపి ప్రణమన్భవాని భవతీం ధ్యాత్వా హృదంభోరుహే
క్లిన్నాశేషవశీకరో భవతి యత్క్లీంకారిణీం నౌంయహం || 3 ||
సౌః శబ్ద ప్రథితామరాదివినుతాం సూక్తిప్రకాశప్రదాం
సౌభాగ్యాంబుధిమంథనామృతరసాం సౌందర్య సంపత్కరీం |
సాన్నిధ్యం దధతీం సదా ప్రణమతాం సాంరాజ్య లక్ష్మీప్రదాం
సౌః కారాంకిత పాదపంకజయుగాం సౌషుంనగాం నౌంయహం || 4 ||
Sri Bala Stotram 1 pdf download – శ్రీ బాలా స్తోత్రం 1