Ajwain meaning in Telugu – అజ్వైన్ లేదా అజ్వాయిన్ గురించి తెలుగులో

✅ Fact Checked

Ajwain meaning in Telugu – అజ్వైన్ లేదా అజ్వాయిన్ గురించి తెలుగులో: Ajwain (అజ్వైన్, అజ్వాయిం, అజ్వాయిన్) ని వాము, వోముు, ఓమ అని పిలుస్తారు. రెండు వేర్వేరు రకాల మొక్కలను వాము అనే పేరుతో పిలుస్తారు. అందువలన కేవలం తెలుగు వారికే కాక భారతీయులందరికీ ఈ మొక్క విషయంలో కొంత గందరగోళం నెలకొని ఉంది. అందుకే మీరు ఏదైనా ఆహార పదార్థాలలో వాము వినియోగించాలనుకుంటే ఆకులు వాడాలా లేక గింజలు వాడాలా అని సరిచూసుకోవాలి. కొంత మంది ఆన్లైన్ లో వంటలు నేర్చుకుని ఒకదాని బదులు మరొకటి వినియోగిస్తుంటారు. మీరు ఈ పొరపాటు చేయకూడదనుకుంటే ఈ పోస్ట్ పూర్తిగా చదవండి.

ajwain meaning in telugu

Ajwain Leaves Plant (Oregano Plant) details in Telugu – వాము ఆకుల మొక్క గురించి తెలుగులో

వాము ఆకుల మొక్క అసలు పేరు కర్పూరవల్లి. ఈ ఆకులను సాధారణంగా బజ్జీల వంటి వంటకాల్లో పచ్చివే వినియోగిస్తారు. ఎండబెట్టిన ఆకులను సువాసన మరియు ప్రత్యేక రుచి కోసం వినియోగిస్తారు. కర్పూరవల్లి ఆకులు కూడా వాము గింజల వంటి సువాసనను వెదజల్లుతుంటాయి కాబట్టి వీటిని అదే పేరుతో పిలుస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఈ మొక్కని ఒరిగానో లేదా ఓరెగానో అని పిలుస్తారు. మన ప్రాచీన ఆయుర్వేద గ్రంధాల్లో ఈ మొక్కను కర్పూరవల్లి మరియు పర్నేయవాణి అనే పేర్లతో పిలిచారు. ప్రస్తుతం ఎక్కువమంది వాము ఆకులు అని చెప్తేనే ఈ మొక్కను గుర్తించగలరు. అందువలన ఈ వ్యత్యాసం తెలుసుకోవటం ద్వారా ఎప్పుడు ఏ పేరు వినియోగించాలో తెలుస్తుంది.

ఈ వాము ఆకుల పొడిని, రసాన్ని, లేదా పచ్చి ఆకులను వివిధ వంటకాలలో వినియోగిస్తారు. కేవలం రుచి మరియు సువాసనల కోసం మాత్రమే కాకుండా వీటిని ఆరోగ్యం మరియు అలంకరణల కోసం కూడా ఉపయోగిస్తారు. కొందరు పూల మొక్కల మధ్యలో సుగంధ పరిమళం కోసం ఈ మొక్కలను పెంచుకుంటారు. వాము ఆకులు కొంచెం వగరుగా, ఘాటుగా ఉంటాయి. తగినంత మోతాదులో తీసుకోవటం వల్ల దుష్పరిణామాలు ఉండవు. అందుకే కొంత మంది భోజనం తరువాత రెండు మూడు ఆకులను నములుతారు. ఇవి అరుగుదలను పెంచి అజీర్ణ సమస్యలను దూరం చేస్తాయి.

అజ్వైన్ / అజ్వాయిన్ (Ajwain) = వాము, ఒరిగానో, కర్పూరవల్లి, పర్నేయవాణి

Ajwain seeds or Carom seeds in Telugu – వాము గింజలు తెలుగులో

Ajwain seeds (అజ్వైన్ సీడ్స్) లేదా Carom seeds (క్యారోమ్ సీడ్స్) ని తెలుగులో వాము గింజలు, వాము విత్తనాలు అని అంటారు. వాము గింజలు మన భారతీయ మసాలా దినుసులలో ఒకటి. వాము మొక్కల్లో థైమోల్ రసాయనం ఉంటుంది. వాము మంచి సువాసన కలిగి ఉంటుంది.

Benefits of Ajwain seeds in Telugu – వాము గింజల ఉపయోగాలు తెలుగులో

వాములో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువలన మన పూర్వీకులు వీటిని కొన్ని వందల సంవత్సరాలుగా జీర్ణ వ్యవస్థను మెరుగు పరచటానికి వినియోగిస్తున్నారు. వాము అసిడిటీ, గ్యాస్, అల్సర్, అజీర్ణం, మరియు కడుపు నొప్పి వంటి సమస్యలను సమర్ధవంతంగా తగ్గిస్తుంది. వాము నీరు త్రాగటం వల్ల పిల్లలకు పాలిచ్చే తల్లులు తమ స్తనాల్లో పాల ఉత్పత్తి పెంచుకోవచ్చు. ఇవి కాకుండా వెయిట్ లాస్ కోసం కూడా వామును వినియోగిస్తారు. అధిక బరువు మరియు దాని పర్యవసానంగా వచ్చే సమస్యలను వాము సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment