కంటి శుక్రవారము గడియలేడింట |
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ||
సొంములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి
కంమని కదంబము కప్పు పన్నీరు |
చెంమతోన వేష్టువలు రొంముతల మొలజుట్టి
తుంమెద మై ఛాయతోన నెంమదినుండే స్వామిని ||
పచ్చకప్పురమె నూరి పసిడి గిన్నెలనించి
తెచ్చి శిరసాదిగ దిగనలది |
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చమల్లెపూవువలె నిటుతానుండే స్వామిని ||
తట్టుపునుగే కూరిచి చట్టలు చేరిచినిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాలనించి |
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని ||
Kanti Sukravaramu pdf download – కంటి శుక్రవారము
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



