అపరాధసహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి || 1 ||
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం |
పూజాం చైవ న జానామి క్షంయతాం పరమేశ్వరి || 2 ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి |
యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే || 3 ||
అపరాధశతం కృత్వా జగదంబేతి చోచ్చరేత్ |
యాం గతిం సమవాప్నోతి న తాం బ్రహ్మాదయః సురాః || 4 ||
సాపరాధోఽస్మి శరణం ప్రాప్తస్త్వాం జగదంబికే |
ఇదానీమనుకంప్యోఽహం యథేచ్ఛసి తథా కురు || 5 ||
అజ్ఞానాద్విస్మృతేర్భ్రాంత్యా యన్న్యూనమధికం కృతం |
విపరీతం చ తత్సర్వం క్షమస్వ పరమేశ్వరి || 6 ||
కామేశ్వరి జగన్మాతః సచ్చిదానందవిగ్రహే |
గృహాణార్చామిమాం ప్రీత్యా ప్రసీద పరమేశ్వరి || 7 ||
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ |
తత్సర్వం క్షంయతాం దేవి ప్రసీద పరమేశ్వరి || 8 ||
గుహ్యాతిగుహ్యగోప్త్రీ త్వం గృహాణాస్మత్కృతం జపం |
సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మహేశ్వరి || 9 ||
సర్వరూపమయీ దేవీ సర్వం దేవీమయం జగత్ |
అతోఽహం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరీం || 10 ||
ఇతి అపరాధక్షమాపణస్తోత్రం సమాప్తం ||
Durga Saptasati Aparadha kshamapana stotram pdf download – అపరాధ క్షమాపణ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



