గిరిచరం కరుణామృతసాగరం
పరిచరం పరమం మృగయాపరం |
సురుచిరం సుచరాచరగోచరం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే || 1 ||
ప్రణతసంచయచింతిత కల్పకం
ప్రణతమాదిగురుం సురశిల్పకం |
ప్రణవరంజిత మంజులతల్పకం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే || 2 ||
అరిసరోరుహశంఖగదాధరం
పరిఘముద్గరబాణధనుర్ధరం |
క్షురిక తోమర శక్తిలసత్కరం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే || 3 ||
విమలమానస సారసభాస్కరం
విపులవేత్రధరం ప్రయశస్కరం |
విమతఖండన చండధనుష్కరం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే || 4 ||
సకలలోక నమస్కృత పాదుకం
సకృదుపాసక సజ్జనమోదకం |
సుకృతభక్తజనావన దీక్షకం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే || 5 ||
శరణకీర్తన భక్తపరాయణం
చరణవారిజమాత్మరసాయనం |
వరకరాత్తవిభూతి విభూషణం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే || 6 ||
మృగమదాంకిత సత్తిలకోజ్జ్వలం
మృగగణాకలితం మృగయాకులం |
మృగవరాసనమద్భుత దర్శనం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే || 7 ||
గురువరం కరుణామృత లోచనం
నిరుపమం నిఖిలామయమోచనం |
పురుసుఖప్రదమాత్మనిదర్శనం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే || 8 ||
ఇతి శ్రీ హరిహరాత్మజ ఆశ్రయాష్టకం ||
Sri Hariharatmaja Ashraya Ashtakam pdf download – శ్రీ హరిహరాత్మజ ఆశ్రయాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.