ఓంకారరూప శబరీవరపీఠదీప
శృంగార రంగ రమణీయ కలాకలాప |
అంగారవర్ణ మణికంఠ మహత్ప్రతాప
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 1 ||
నక్షత్రచారునఖరప్రద నిష్కళంక
నక్షత్రనాథముఖ నిర్మలచిత్తరంగ |
కుక్షిస్థలస్థిత చరాచర భూతసంఘ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 2 ||
మంత్రార్థ తత్త్వ నిగమార్థ మహావరిష్ఠ
యంత్రాది తంత్ర వరవర్ణిత పుష్కలేష్ట |
సంత్రాసితారికుల పద్మసుఖోపవిష్ట
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 3 ||
శిక్షాపరాయణ శివాత్మజ సర్వభూత-
-రక్షాపరాయణ చరాచర హేతుభూత |
అక్షయ్య మంగళ వరప్రద చిత్ప్రబోధ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 4 ||
వాగీశవర్ణిత విశిష్టవచోవిలాస
యోగీశ యోగకర యాగఫలప్రకాశ |
యోగేశ యోగి పరమాత్మ హితోపదేశ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 5 ||
యక్షేశపూజ్య నిధిసంచయ నిత్యపాల
యక్షీశ కాంక్షిత సులక్షణ లక్ష్యమూల |
అక్షీణ పుణ్య నిజభక్తజనానుకూల
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 6 ||
స్వామిన్ ప్రభారమణ చందనలిప్తదేహ
చామీకరాభరణ చారుతురంగవాహ |
శ్రీమత్సురాభరణ శాశ్వతసత్సమూహ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 7 ||
ఆతాంరహేమరుచిరంజిత మంజుగాత్ర
వేదాంతవేద్య విధివర్ణిత వీర్యవేత్ర |
పాదారవింద పరిపావన భక్తమిత్ర
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 8 ||
బాలామృతాంశు పరిశోభిత ఫాలచిత్రా
నీలాలిపాలిఘనకుంతల దివ్యసూత్ర |
లీలావినోద మృగయాపర సచ్చరిత్ర
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 9 ||
భూతిప్రదాయక జగత్ప్రథితప్రతాప
భీతిప్రమోచక విశాలకలాకలాప |
బోధప్రదీప భవతాపహరస్వరూప
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 10 ||
వేతాళభూతపరివారవినోదశీల
పాతాళభూమి సురలోక సుఖానుకూల |
నాదాంతరంగ నతకల్పక ధర్మపాల
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 11 ||
శార్దూలదుగ్ధహర సర్వరుజాపహార
శాస్త్రానుసార పరసాత్త్విక హృద్విహార |
శస్త్రాస్త్ర శక్తిధర మౌక్తికముగ్ధహార
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 12 ||
ఆదిత్యకోటిరుచిరంజిత వేదసార
ఆధారభూత భువనైక హితావతార |
ఆదిప్రమాథిపదసారస పాపదూర
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 13 ||
పంచాద్రివాస పరమాద్భుతభావనీయ
పింఛావతంసమకుటోజ్జ్వల పూజనీయ |
వాంఛానుకూల వరదాయక సత్సహాయ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 14 ||
హింసావిహీన శరణాగతపారిజాత
సంసారసాగరసముత్తరణైకపోత |
హంసాదిసేవిత విభో పరమాత్మబోధ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 15 ||
కుంభీంద్ర కేసరి తురంగమ వాహ తుంగ
గంభీర వీర మణికంఠ విమోహనాంగ |
కుంభోద్భవాది వరతాపసచిత్తరంగ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 16 ||
సంపూర్ణ భక్తవర సంతతి దానశీల
సంపత్సుఖప్రద సనాతన గానలోల |
సంపూరితాఖిల చరాచరలోకపాల
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 17 ||
వీరాసనస్థిత విచిత్రవనాధివాస
నారాయణప్రియ నటేశ మనోవిలాస |
వారాశిపూర్ణ కరుణామృత వాగ్వికాస
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 18 ||
క్షిప్రప్రసాదక సురాసురసేవ్యపాద
విప్రాదివందిత వరప్రద సుప్రసాద |
విభ్రాజమాన మణికంఠ వినోదభూత
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 19 ||
కోటీరచారుతర కోటిదివాకరాభ
పాటీరపంకకలభప్రియ పూర్ణశోభ |
వాటీవనాంతరవిహార విచిత్రరూప
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 20 ||
దుర్వారదుఃఖహర దీనజనానుకూల
దుర్వాస తాపస వరార్చిత పాదమూల |
దర్వీకరేంద్ర మణిభూషణ ధర్మపాల
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 21 ||
నృత్తాభిరంయ నిగమాగమ సాక్షిభూత
భక్తానుగంయ పరమాద్భుత హృత్ప్రబోధ |
సత్తాపసార్చిత సనాతన మోక్షభూత
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 22 ||
కందర్పకోటి కమనీయకరావతార
మందార కుంద సుమవృంద మనోజ్ఞహార |
మందాకినీతటవిహార వినోదపూర
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 23 ||
సత్కీర్తనప్రియ సమస్తసురాధినాథ
సత్కారసాధు హృదయాంబుజ సన్నికేత |
సత్కీర్తిసౌఖ్య వరదాయక సత్కిరాత
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 24 ||
జ్ఞానప్రపూజిత పదాంబుజ భూతిభూష
దీనానుకంపిత దయాపర దివ్యవేష |
జ్ఞానస్వరూప వరచక్షుష వేదఘోష
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 25 ||
నాదాంతరంగ వరమంగళనృత్తరంగ-
-పాదారవింద కుసుమాయుధ కోమలాంగ |
మాతంగకేసరితురంగమవాహతుంగ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 26 ||
బ్రహ్మస్వరూప భవరోగపురాణవైద్య
ధర్మార్థకామవరముక్తిద వేదవేద్య |
కర్మానుకూలఫలదాయక చిన్మయాద్య
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 27 ||
తాపత్రయాపహర తాపసహృద్విహార
తాపింఛ చారుతరగాత్ర కిరాతవీర |
ఆపాదమస్తక లసన్మణిముక్తహార
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 28 ||
చింతామణిప్రథిత భూషణభూషితాంగ
దంతావలేంద్ర హరివాహన మోహనాంగ |
సంతానదాయక విభో కరుణాంతరంగ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 29 ||
ఆరణ్యవాస వరతాపస బోధరూప
కారుణ్యసాగర కలేశ కలాకలాప |
తారుణ్య తామర సులోచన లోకదీప
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 30 ||
ఆపాద చారుతర కామసమాభిరామ
శోభాయమాన సురసంచయ సార్వభౌమ |
శ్రీపాండ్య పూర్వసుకృతామృత పూర్ణధామ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబం || 31 ||
Sri Bhuthanatha Karavalamba Stava pdf download – శ్రీ భూతనాథ కరావలంబ స్తవః