Paluke Bangaramayena pdf download – పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా ||
పలుకే బంగారమయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరవ చక్కని తండ్రి
పలుకే బంగారమాయెనా ||
ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెరనంమితిని తండ్రి
పలుకే బంగారమాయెనా ||
రాతినాతిగ జేసి భూతలమున
ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నంమితి తండ్రి
పలుకే బంగారమాయెనా ||
ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు
పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి
పలుకే బంగారమాయెనా ||
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాదా
కరుణించు భద్రాచలవర రామదాస పోష
పలుకే బంగారమాయెనా ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment