Ganesha Pancharatnam in telugu pdf download – శ్రీ గణేశ పంచరత్నం

ముదా కరాత్తమోదకం సదా విముక్తిసాధకం
కళాధరావతంసకం విలాసిలోకరక్షకం |
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకం నమామి తం వినాయకం || 1 ||
నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం
నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరం |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం || 2 ||
సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం
దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరం |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం || 3 ||
అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం
పురారిపూర్వనందనం సురారిగర్వచర్వణం |
ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం
కపోలదానవారణం భజే పురాణవారణం || 4 ||
నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం
అచింత్యరూపమంతహీనమంతరాయకృంతనం |
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంతమేవ తం విచింతయామి సంతతం || 5 ||
మహాగణేశపంచరత్నమాదరేణ యోఽన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్గణేశ్వరం |
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోఽచిరాత్ || 6 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృత శ్రీగణేశ పంచరత్నం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment